Innovation Award 2021: క్లారివేట్ అవార్డును అందుకున్న ప్రభుత్వ రంగ సంస్థ?
ప్రభుత్వ రంగ ఇంజనీరింగ్ దిగ్గజం భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్) తాజాగా క్లారివేట్ సౌత్, సౌత్ ఈస్ట్ ఏషియా ఇన్నోవేషన్ అవార్డ్ దక్కించుకుంది. అత్యంత వినూత్న కంపెనీగా 2021 సంవత్సరానికిగాను భారీ పరిశ్రమల విభాగంలో సంస్థకు ఈ గౌరవం దక్కింది. అక్టోబర్ 18న న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో క్లారివేట్ ప్రతినిధి రజత్ సిక్కా నుంచి ఈ అవార్డును బీహెచ్‌ఈఎల్ అధికారి రేణుక గెరా స్వీకరించారు. 2018, 2020లోనూ క్లారివేట్ అవార్డ్‌ను బీహెచ్‌ఈఎల్ సొంతం చేసుకుంది. 1956లో స్థాపితమైన బీహెచ్‌ఈఎల్ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.
ఎల్‌అండ్‌టీతో వొడాఫోన్ జట్టు
5జీ ఆధారిత స్మార్ట్ సిటీ సొల్యూషన్స్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు నిర్మాణ రంగ దిగ్గజం లార్సన్ అండ్ టూబ్రో (ఎల్‌అండ్‌టీ)తో టెలికం సంస్థ వొడాఫోనా ఐడియా (వీఐఎల్) జట్టుకట్టింది. ప్రభుత్వం కేటాయించిన స్పెక్ట్రంతో ప్రస్తుతం నిర్వహిస్తున్న 5జీ ట్రయల్స్‌లో ఇది భాగంగా ఉంటుందని వీఐఎల్ వెల్లడించింది. పుణెలో ఈ పైలట్ ప్రాజెక్టును నిర్వహించనున్నట్లు పేర్కొంది.
చదవండి: ఆర్థిక నోబెల్ పురస్కారం–2021
క్విక్ రివ్యూ :
ఏమిటి : క్లారివేట్ సౌత్, సౌత్ ఈస్ట్ ఏషియా ఇన్నోవేషన్ అవార్డు-2021ను అందుకున్న ప్రభుత్వ రంగ సంస్థ?
ఎప్పుడు : అక్టోబర్ 18
ఎవరు : భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్)
ఎక్కడ : న్యూఢిల్లీ
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్