BBC Indian Sportswoman of the Year Award: లవ్లీనా బొర్గొహైన్ ఏ క్రీడలో ప్రసిద్ధి చెందింది?
రెండు ఒలింపిక్ పతకాల విజేత, బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధు(పీవీ సింధు) రెండోసారి ‘బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌ఉమన్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు రేసులో నిలిచింది. 2020లో సింధుకు ఈ అవార్డు లభించింది. ప్రముఖ బ్రాడ్‌కాస్టింగ్ నెట్‌వర్క్ బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్(బీబీసీ) ఫిబ్రవరి 8న విడుదల చేసిన 2022 నామినీల్లో తెలుగు తేజంతో పాటు టోక్యోలో రజతం నెగ్గిన వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను, బాక్సింగ్‌లో కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గొహైన్, గోల్ఫర్ అదితి అశోక్, పారాలింపియన్ షూటర్ అవనీ లేఖరా ఉన్నారు. ఆన్‌లైన్ ఓటింగ్ ద్వారా విజేతను ఎంపిక చేస్తారు. 2022, ఫిబ్రవరి 28 వరకు ఓటింగ్ నిర్వహిస్తారు. మార్చి 28న ఏర్పాటు చేసే కార్యక్రమంలో విజేతను ప్రకటిస్తారు. 2021 సంవత్సరంలో భారత చెస్ దిగ్గజం కోనేరు హంపికి ఈ అవార్డు లభించింది. భారత క్రీడారంగంలో విశేష ప్రతిభ కనబరుస్తూ అద్వితీయ విజయాలను సాధించిన మహిళా క్రీడాకారులను సత్కరించే లక్ష్యంతో ఏటా బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందిస్తున్నారు.
Boxing: స్ట్రాండ్‌జా స్మారక టోర్నీని ఏ దేశంలో నిర్వహించనున్నారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌ఉమన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు రేసులో నిలిచిన బ్యాడ్మింటన్ స్టార్?
ఎప్పుడు : ఫిబ్రవరి 8
ఎవరు : పూసర్ల వెంకట సింధు(పీవీ సింధు)
ఎందుకు : క్రీడారంగంలో విశేష ప్రతిభ కనబరుస్తూ అద్వితీయ విజయాలను సాధించినందున..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్