Skip to main content

Nobel Prize 2022: రసాయన శాస్త్రంలో ముగ్గురికి ఉమ్మడిగా నోబెల్‌

- కరోలిన్‌ ఆర్‌.బెర్టోజీ, కె.బ్యారీ షార్ప్‌లెస్, మోర్టెన్‌ మెల్డాల్‌కు ప్రతిష్టాత్మక బహుమతి
3 scientists win Nobel Prize in Chemistry
3 scientists win Nobel Prize in Chemistry

రసాయన శాస్త్రంలో ఈ ఏడాదికి (2022) గాను ముగ్గురు శాస్త్రవేత్తలకు ఉమ్మడిగా నోబెల్‌ బహుమతి దక్కింది. అమెరికాకు చెందిన కరోలిన్‌ ఆర్‌.బెర్టోజీ, కె.బ్యారీ షార్ప్‌లెస్, డెన్మార్క్‌కు చెందిన మోర్టెన్‌ మెల్డాల్‌ ఈ ప్రతిష్టాత్మక బహుమతికి ఎంపికయ్యారు. పాలిమర్స్, క్యాన్సర్‌ ఔషధాల తయారీ, డీఎన్‌ఏ మ్యాపింగ్‌ వంటి వాటిలో ఉపయోగపడే క్లిక్‌ కెమిస్ట్రీ, బయో ఆర్థోగానల్‌ రియాక్షన్స్‌లో వారు విశేషమైన కృషి చేశారని రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ అక్టోబర్ 5న  ప్రకటించింది. మరింత మెరుగైన ఔషధాలను రూపొందించడానికి వారి పరిశోధనలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొంది. విశేషం ఏమిటంటే.. ఈసారి కెమిస్ట్రీలో నోబెల్‌కు ఎంపికైన ముగ్గురిలో ఒకరైన కె.బ్యారీ షార్ప్‌లెస్‌(81) 2001లో నోబెల్‌ బహుమతి అందుకున్నారు. ఇప్పుడు రెండోసారి స్వీకరించబోతున్నారు. ఇలా రెండుసార్లు నోబెల్‌ ప్రైజ్‌ స్వీకరించిన ఐదో వ్యక్తిగా రికార్డు సృష్టించబోతున్నారు. 

Also read: Nobel Peace Prize for 2022 : ఈ ఏడాది నోబెల్ శాంతి పుర‌స్కారం వీరికే..

మోర్టెన్‌ మెల్డాల్‌ (68) యూనివర్సిటీ ఆఫ్‌ కోపెన్‌హగన్‌లో పని చేస్తున్నారు. షార్ప్‌లెస్‌ కాలిఫోరి్నయాలోని స్క్రిప్స్‌ రీసెర్చ్‌ సంస్థలో పనిశోధనలు సాగిస్తున్నారు. ఇక కరోలిన్‌ ఆర్‌.బెర్టోజీ (55) స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో పనిచేస్తున్నారు. ఆమె క్లిక్‌ కెమిస్ట్రీని కొత్త స్థాయికి తీసుకెళ్లారని నోబెల్‌ కమిటీ ప్రశంసించింది. 

Also read: Nobel Prize 2022: భౌతిక శాస్త్రంలో ముగ్గురికి ఉమ్మడిగా నోబెల్‌

రసాయన శాస్త్రంలో గత ఏడాది (2021) నోబెల్‌ .. బెంజమిన్‌ లిస్ట్, డేవిడ్‌ మెక్‌మిలన్‌లకు లభించింది.

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 07 Oct 2022 06:30PM

Photo Stories