Nobel Prize 2022: భౌతిక శాస్త్రంలో ముగ్గురికి ఉమ్మడిగా నోబెల్
ఫోటాన్‌లలో చిక్కుముడులు, క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో అలెన్ ఆస్పెక్ట్(75), జాన్ ఎఫ్ క్లాసర్(79), ఆంటోనీ జీలింగర్(77) సాగించిన విశేషమైన పరిశోధనలను గుర్తించి, ఈ బహుమానానికి ఉమ్మడిగా ఎంపిక చేసినట్లు స్వీడన్‌లోని ‘రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్’ అక్టోబర్ 4న ప్రకటించింది. క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ నేడు ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగమని, ఉజ్వలమైన భవిష్యత్తు ఉందని నోబెల్ కమిటీ సభ్యులు ఈవా ఒల్సాన్ చెప్పారు. సమాచార బదిలీ, క్వాంటమ్ కంప్యూటింగ్, సెన్సింగ్ టెక్నాలజీ వంటి విభాగాల్లో క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ గణనీయమైన పాత్ర పోషిస్తోందని అన్నారు. క్వాంటమ్ మెకానిక్స్ నుంచే ఈ సైన్స్ ఉద్భవించిందని తెలిపారు. ఆలెన్ ఆస్పెక్ట్ ఫ్రాన్స్‌కు చెందినవారు కాగా, జాన్ ఎఫ్ క్లాసర్ అమెరికన్ పౌరుడు, ఆంటోన్ జీలింగర్ ఆ్రస్టియా వాసి.
ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు 2010లో ఇజ్రాయెల్‌లో వూల్ఫ్ ప్రైజ్ గెలుచుకున్నారు. నోబెల్ ప్రైజ్ కోసం చాలా ఏళ్లుగా వీరి పేర్లు పరిశీలనకు వస్తున్నాయి. నోబెల్ ప్రైజ్ లభించిందని తెలియగానే మొదట తాను నమ్మలేకపోయానని జీలింగర్ చెప్పారు. ఇది తనకు సానుకూలమైన షాక్ అని ఆనందం వ్యక్తం చేశారు. ఆయన యూనివర్సిటీ ఆఫ్ వియన్నాలో పనిచేస్తున్నారు.
Also read: స్వీడిష్ శాస్త్రవేత్త స్వాంటే పాబోకు Noble Prize in Medicine
భౌతిక శాస్త్రంలో గత ఏడాది (2021) నోబెల్ పురస్కారం సూకురో మనాబే, క్లాజ్ హసల్‌మన్, జార్జియో పారిసి అనే ముగ్గురు శాస్త్రవేత్తలకు ఉమ్మడిగా లభించిన సంగతి తెలిసిందే.