Skip to main content

Aadhaar Update News 2024 : కొత్త ఆధార్ రూల్స్ ప్రకారం.. మీ ఆధార్ కార్డును రద్దు చేసుకునే అవకాశం..

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఇటీవల పుట్టిన తేదీకి రుజువుగా ఆధార్ కార్డుని పరిగణించబోమని ప్రకటించింది. అయితే ఇప్పుడు యూఐడీఏఐ ప్రకారం.. కొత్త ఫామ్ ఉపయోగించి 18 సంవత్సరాలు నిండిన వారు ఆధార్ నెంబర్ సైతం రద్దు చేసుకోవచ్చని తెలుస్తోంది.
New UIDAI Form   Aadhaar Card   aadhar card update news telugu   Employee Provident Fund Organization Announcement

కొత్త ఆధార్ రూల్స్ ప్రకారం, ఆధార్ కార్డు ఉన్న వారు 18 ఏళ్ళు నిండిన తరువాత కార్డుని రద్దు చేసుకోవచ్చు. దీనికోసం యూఐడీఏఐ ఫామ్-9ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఆధార్ ఎన్‌రోల్మెంట్ అండ్ అప్డేట్ రెగ్యులేషన్స్ 2016 ప్రకారం.. కొన్ని సందర్భాల్లో మాత్రమే రద్దు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

ఏవైనా మార్పులు.. చేర్పులు.. 
ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ ఆధార్ నంబర్‌లను కలిగి ఉన్న సందర్భంలో.. ఒక ఆధార్ నెంబర్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఒకటి మాత్రమే ఉపయోగించుకోవచ్చు. అందులో కూడా ఏవైనా మార్పులు.. చేర్పులు వంటివి చేఉకోవడానికి యూఐడీఏఐ అవకాశం కల్పించింది.

క్యాన్సిల్ చేసుకునే వీలు..
ఆధార్ కార్డులో ఫోటొపైన ఫోటో వచ్చినప్పుడు క్యాన్సిల్ చేసుకునే వీలుంటుంది. కొన్ని సందర్భాల్లో కొత్త ఫోటో గ్రాఫ్ తీసుకోకుండానే పాత ఫోటోను వినియోగించడం, లేదా బయోమెట్రిక్ సమాచారం లేకుండానే ఆధార్ నమోదు చేసిన సందర్భంలో వినియోగదారుడు ఆధార్ కార్డును రద్దు చేసుకోవచ్చు. బయోమెట్రిక్ సమాచారాన్ని సంగ్రహించకుండా ఉండటానికి పెద్దలు ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లవాడిగా నమోదు చేసుకుని ఉంటే.. అలాంటి ఆధార్ నెంబర్ కూడా రద్దు చేసుకోవచ్చు.

మూడు నెలల్లో కార్డును..
షెడ్యూల్ VI 27(1)(c) ప్రకారం, ఆధార్ నంబర్ హోల్డర్ అయిన నివాసి, పద్దెనిమిది సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత, అతని/ఆమె ఆధార్ నంబర్‌ను రద్దు చేయడానికి ప్రాంతీయ అధికార కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ తర్వాత మూడు నెలల్లో కార్డు రద్దు చేస్తారు. ఆధార్ నెంబర్ రద్దు చేసుకున్న తర్వాత.. ఆధార్ నంబర్ హోల్డర్‌కు అథారిటీ అందించే సేవలు శాశ్వతంగా నిలిచిపోతాయి.

Published date : 23 Jan 2024 06:58PM

Photo Stories