విశ్లేషణ సామర్థ్యంతోనే విజయం...
Sakshi Education
చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ) కోర్సును పూర్తిచేయడమనేది కొందరికే సాధ్యం..
సీఏ చదవాలంటే ఎన్నో ఏళ్లు కష్టపడి చదవాలి.. ఇలా చాలామంది విద్యార్థులు సీఏ గురించి ఆందోళన చెందుతుంటారు! అయితే లక్ష్యంపై స్పష్టత, విశ్లేషణాత్మక సామర్థ్యం ఉంటే సీఏ కోర్సును దిగ్విజయంగా పూర్తిచేసి, సుస్థిర కెరీర్‌ను సొంతం చేసుకోవచ్చంటున్నాడు ఇటీవల సీఏ-ఐపీసీసీ ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో ఆరో ర్యాంకు సాధించిన చాంద్‌బాషా. ఈ అత్యున్నత విజయానికి అనుసరించిన వ్యూహాలేంటో ఆయన మాటల్లోనే...
మాది నిజామాబాద్ జిల్లాలోని ధర్మారం (బి) గ్రామం. నాన్న షేక్ మస్తాన్ ట్రాక్టర్ మెకానిక్. అమ్మ షబీర గృహిణి. పదో తరగతిలో 8.2 గ్రేడ్ పాయింట్లు వచ్చాయి. ఆ తర్వాత ‘మాస్టర్‌మైండ్స్ సీఏ అవేర్‌నెస్ సీడీ’ చూసి, ఆ కోర్సు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నా. ఇంటర్ ఎంఈసీలో చేరి, 700 మార్కులు సాధించాను. సీఏ విషయంలో అన్ని విధాలా అన్నయ్య నాగుర్ బాషా మార్గదర్శిగా నిలిచి, శిక్షణ సంస్థలో చేర్పించారు. కోర్సులో చేరిన మొదట్లో కొంచెం భయపడ్డాను. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సీఏ పూర్తిచేయాలని నిర్ణయించుకున్నాను. సీఏ-సీపీటీలో 200 మార్కులకు 104 మార్కులు వచ్చాయి. ఈ మార్కులను చూసి, నేనెప్పుడూ నిరాశ చెందలేదు. మరింత ఉత్సాహంతో సీఏ-ఐపీసీసీకి సిద్ధమై 392 మార్కులు సాధించడంతో పాటు ఆలిండియా ఆరో ర్యాంకు కైవసం చేసుకున్నాను. తొలి ప్రయత్నంలో ఐపీసీసీ పూర్తిచేయలేకపోయినప్పుడు అన్నయ్య అండగా ఉండి, ప్రోత్సహించాడు. అదే ఈ రోజు నన్ను ఉన్నత స్థానంలో నిలిచేలా చేసింది.
ఈ విజయంలో మాస్టర్‌మైండ్ పాత్ర కీలకమని చెప్పాలి. సంస్థ షెడ్యూల్, రివిజన్ ఎగ్జామ్స్, స్టడీ అవర్స్ ఇలా ఇవన్నీ విజయానికి కారణాలే. సన్నద్ధతలో భాగంగా హార్డ్‌వర్క్‌తో పాటు స్మార్ట్ వర్క్ చేశాను. తరగతిగదిలో ప్రతి సబ్జెక్టుకి రన్నింగ్ నోట్స్ రాసుకునేవాడిని. ప్రతి అంశాన్నీ కచ్చితంగా రివిజన్ చేశాను. నేను తయారు చేసుకున్న ఫాస్ట్‌ట్రాక్ నోట్స్ సన్నద్ధతను తేలిక చేసింది. పాత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేశాను.
నా సలహా:
ఈ విజయంలో మాస్టర్‌మైండ్ పాత్ర కీలకమని చెప్పాలి. సంస్థ షెడ్యూల్, రివిజన్ ఎగ్జామ్స్, స్టడీ అవర్స్ ఇలా ఇవన్నీ విజయానికి కారణాలే. సన్నద్ధతలో భాగంగా హార్డ్‌వర్క్‌తో పాటు స్మార్ట్ వర్క్ చేశాను. తరగతిగదిలో ప్రతి సబ్జెక్టుకి రన్నింగ్ నోట్స్ రాసుకునేవాడిని. ప్రతి అంశాన్నీ కచ్చితంగా రివిజన్ చేశాను. నేను తయారు చేసుకున్న ఫాస్ట్‌ట్రాక్ నోట్స్ సన్నద్ధతను తేలిక చేసింది. పాత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేశాను.
నా సలహా:
- సీఏ కోర్సులోని రెండో దశ అయిన ఐపీసీసీ చాలా కీలకమైంది. ఇందులో చేరిన తొలిరోజు నుంచే పటిష్ట ప్రణాళిక రూపొందించుకొని దాన్ని కచ్చితంగా అనుసరించాలి. ఈ విధంగా చేస్తే తొలి ప్రయత్నంలోనే విజయం సాధించొచ్చు. అన్ని సబ్జెక్టులకు ఒకేచోట శిక్షణ ఇచ్చే సంస్థను ఎంపిక చేసుకోవడం మంచిది. దీనివల్ల సమయం వృథా కాదు. సమయస్ఫూర్తి, విశ్లేషణాత్మక సామర్థ్యం ద్వారా సీఏ కోర్సును విజయవంతంగా పూర్తిచేయొచ్చు.
- తరగతిగదిలో వివరించే ఉదాహరణలు, చార్ట్స్‌ను తప్పకుండా నోట్స్‌లో రాసుకోవాలి. రివిజన్ సమయంలో ప్రాక్టీస్ మాన్యువల్, రన్నింగ్ నోట్స్‌ను అనుసరించాలి. రోజుకు రెండు సబ్జెక్టులను (ఒకటి థియరీ, మరొకటి ప్రాబ్లమాటిక్) చదివేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.
- కీవర్డ్స్‌ను ప్రత్యేకంగా నోట్స్‌లో రాసుకోవడం, మెటీరియల్‌లో అండర్‌లైన్ చేయడం వంటివి రివిజన్‌నే తేలిక చేస్తాయి.
- మొదటి నుంచి ఏ మెటీరియల్‌ను చదువుతున్నారో చివరి వరకు దాన్నే అనుసరించాలి. ప్రతి ప్రశ్నకు సూటిగా సమాధానం రాయడం ముఖ్యం. వీలైనంత త్వరగా సీఏ ప్రాక్టికల్ శిక్షణ పూర్తిచేసి, మంచి సీఏగా రాణించాలనేదే నా లక్ష్యం.
Published date : 05 Sep 2019 02:48PM