సివిల్స్‌లో మూడు సార్లు ఫెయిల్..నాలుగో సారి ఎంపికయ్యా..అయితే మళ్లీ..: అంజిత చేప్యాల,డీసీపీ
Sakshi Education
నైపుణ్యం ఉన్నచోట వివక్షకు చోటుండదు.. అందరికీ అన్ని స్థాయిల్లోనూ సవాళ్లు ఎదురవుతారుు.. భయం వీడితే పరిష్కారం అదే దొరుకుతుంది.. లక్ష్యాన్ని చేరుకోవాలంటే క్రమం తప్పకుండా ప్రయత్నించాలి అంటారు అంజిత చేప్యాల... తెలంగాణకు చెందిన ఏజీఎంయూటీ క్యాడర్ ఐపీఎస్. దేశ రాజధానిలో రాష్ట్రపతి భవన్, ప్రధాని, హోంమంత్రుల నివాసాలతో పాటు ఇండియా గేట్ వంటి అత్యంత ప్రాముఖ్య ప్రదేశాలున్న లుటియన్ ్స జోన్ లో శాంతిభద్రతల పర్యవేక్షణాధికారిగా ఆమె విధులు నిర్వర్తిస్తున్నారు. విజ్ఞాన్ భవన్‌లో ఇటీవల కేంద్ర ప్రభుత్వం, రైతుల సమావేశాల సమయంలో శాంతి భద్రతలు పర్యవేక్షించిన న్యూఢిల్లీ జిల్లా అదనపు డీసీపీ (శాంతి భద్రతలు) అంజిత.. సాధనతోనే ఈ స్థారుు సాధించానని చెబుతున్నారు. ఆమె ప్రస్థానం ఆమె మాటల్లోనే....
Published date : 01 Dec 2021 05:24PM