సివిల్స్‌కు ప్రిపేరవుతూ... గ్రూప్-1 సాధించా
Sakshi Education
పదో తరగతి పరీక్షలు లక్షల మంది రాస్తారు. కానీ, టాప్ గ్రేడ్ కొందరికే!!
జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షల్లోనైతే... టాప్ ర్యాంకు వస్తేనే కోరుకున్న కాలేజీలో సీటు! ఇక కష్టపడి టాప్ ర్యాంకులతో ఇంజనీరింగ్, మెడిసిన్ వంటివి పూర్తిచేస్తే... క్యాంపస్‌లో ఉండగానే లక్షల్లో జీతాలతో కొలువులొస్తాయి. కొందరు చేరుతారు. కానీ, మరికొందరు.. వాటినస్సలు పట్టించుకోరు. క్యాట్, గేట్ పరీక్షలు రాసి తమ గమ్యం వేరే అని చెబుతారు. కొందరు సివిల్స్, గ్రూప్స్ వంటి పరీక్షలు రాసి విజేతలవుతారు. బాధ్యతాయుతమైన సివిల్ సర్వెంట్లవుతారు. మరికొందరు ఉద్యోగం వచ్చినా... కొన్నాళ్లు చేసి సంతృప్తి లేదని వదిలేస్తారు. సక్సెస్ అవుతారో లేదో అని ఇంట్లోవాళ్లు భయపడినా... ఆత్మవిశ్వాసమే ఆయుధంగా ధైర్యంగా అడుగేస్తారు. స్టార్టప్ కంపెనీలు పెట్టి పెద్దపెద్ద సామ్రాజ్యాలనే సృష్టిస్తారు. నిజానికి వీళ్లంతా రాత్రికి రాత్రే విజేతలుగా మారిపోలేదు. దానివెనక కొన్నేళ్ల అకుంఠిత దీక్ష... సడలని విశ్వాసం... లక్ష్యం దిశగా అలుపెరగని ప్రయాణం ఉన్నాయి. ఏపీపీఎస్సీ 2016లో నిర్వహించిన గ్రూప్-1 లో మూడో ర్యాంక్ సాధించిన చల్లపల్లె యశ్వంత్ కుమార్ రెడ్డి స్ఫూర్తి కథనం..
బీటెక్ పూర్తికాగానే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఇంజనీర్‌గా కొలువు.. లక్షల వార్షిక వేతనం.. కానీ, సమాజానికి ఉపయోగపడే ఉద్యోగం చేయాలనే తపనతో సివిల్స్‌కు ప్రిపేర్ అవ్వాలని నిర్ణయించుకున్నా. అదే సమయంలో ఏపీపీఎస్సీ గ్రూప్-1 నోటిఫికేషన్ వచ్చింది. దానికి ప్రయత్నిస్తే ఏకంగా మూడో ర్యాంకు వచ్చింది. మాది కర్నూలు జిల్లా, చాగలమర్రి మండలం, కలుగోట్ల పల్లె. నాన్న పుల్లారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు. అమ్మ లక్ష్మీదేవి గృహిణి. నేను అయిదో తరగతి వరకు నాన్న పాఠాలు చెప్పే కడప జిల్లా కొట్టాలలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదివా. ఆరు నుంచి పది వరకు రాజంపేటలోని జవహర్ నవోదయ విద్యాలయలో, ఇంటర్ విజయవాడలో పూర్తిచేశా. ఆ తర్వాత జేఎన్‌టీయూ కాకినాడలో కంప్యూటర్‌సైన్స్ ఇంజనీరింగ్ చదివా.
మనసంతా సివిల్స్ పైనే...
ఇంజనీరింగ్‌లో ఉండగానే సివిల్స్‌కు ప్రిపేరవ్వాలని అనుకున్నా. మొదట ఏదో ఒక ప్రభుత్వం ఉద్యోగం ముఖ్యమని భావించా. అందుకోసం గేట్‌లో 201 ర్యాంకుతో ఐఓసీఎల్‌లో ఇంజనీర్ ఉద్యోగంలో చేరా. 2016 ఆగస్టులో ఉద్యోగం రాగా శిక్షణ అనంతరం సెప్టెంబర్‌లో బెంగళూరులో పోస్టింగ్ లభించింది. ఉద్యోగంలో చేరినప్పటి నుంచే సొంతంగా సివిల్స్‌కు సన్నద్ధమవ్వడం ప్రారంభించా. రోజుకు 8 గంటలపాటు పనిచేస్తూ మిగతా సమయాన్ని సివిల్స్ ప్రిపరేషన్‌కు కేటాయించా. మొదట మూడు నెలల పాటు సివిల్స్‌కు సంబంధించి ప్రాథమిక పుస్తకాలు రిఫర్ చేస్తూ సొంతంగా నోట్స్ సిద్ధం చేసుకున్నా. స్కూల్లో సీబీఎస్‌ఈ సిలబస్ చదవడం వల్ల ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను త్వరగానే ఔపోసన పట్టా. ఇలా అలుపెరుగక సివిల్స్ ప్రిపరేషన్ కొనసాగిస్తుండగానే.. 2016 డిసెంబర్‌లో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. దాంతో అదృష్టం పరీక్షించుకుందామని ప్రిపరేషన్‌కు ఉపక్రమించా.
ఉద్యోగం, చదువు :
‘ఉద్యోగం చేస్తూ చదవడం కొంత కష్టంగానే ఉండేది. ఉద్యోగంలో భాగంగా షిప్టుల్లో పనిచేయాల్సి రావడంతో సమయం దొరికినప్పుడల్లా సన్నద్ధమయ్యేవాడిని. ఉదయం ఆరు గంటల షిప్టు ఉంటే.. రాత్రి 2 వరకు చదివి 6 గంటలకు నిద్రలేచి ఉద్యోగానికి వెళ్లేవాడిని. 8 గంటలే ఉద్యోగానికి కేటాయించడం కాస్త అసంతృప్తిగా అనిపించిన సందర్భాలు ఉన్నాయి. ఉద్యోగంలో కొత్త విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. టెక్నాలజీలపై పట్టు సాధించడానికి సమయం వెచ్చించాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇంజనీర్‌గా మెరుగవడం కంటే సివిల్స్ సాధించడమే ప్రాధాన్యంగా ముందుకెళ్లాను. ఇలాంటి సందర్భాల్లో ఉద్యోగానికి న్యాయం చేయలేకపోతున్నానే బాధ కలిగేది.
అలసట చెందకుండా...
ఉద్యోగం చేస్తూ సివిల్స్, గ్రూప్స్ వంటి పరీక్షలకు ప్రిపరేషన్ కొనసాగించడం కష్టమే! అయినా ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తే విజయం సాధించొచ్చు. నేను రోజువారీ టార్గెట్స్ పెట్టుకొని వాటిని చేరుకునేవాడిని. ఒక్కోసారి తీవ్ర ఒత్తిడి ఎదురయ్యేది. అలాంటప్పుడు కొత్త ప్రదేశాలకు వెళ్లడం, నెలకోసారి సినిమా చూడడం లాంటివి చేయడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం లభించేది. ప్రిపరేషన్‌లో సమయాన్ని ఎక్కడా వృథా చేయలేదు. ఉద్యోగ జీవితంలో కొన్ని సందర్భాల్లో అస్సలు తీరిక ఉండేదికాదు. కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ల అప్‌డేట్, ఆడిట్ సమయంలో నివేదికలు అందించడం, మీటింగ్‌లు.. ఇతరత్రా పనుల వల్ల కొన్నిసార్లు ఆఫీసులో ఎక్కువ సమయం కేటాయించాల్సి వచ్చేది. అలాంటప్పుడు ప్రిపరేషన్ టార్గెట్లు పెండింగ్‌లో పడడంతో.. వాటిని మరుసటి రోజు కూర్చొని పూర్తిచేసేవాడిని.
సొంతంగా ప్రిపేరవ్వచ్చు..
ప్రస్తుతం ఆన్‌లైన్లో ప్రతి అంశానికి సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంది. కాబట్టి కోచింగ్ అవసరం లేదనేది నా ఉద్దేశం. ఇంటర్నెట్ (యూట్యూబ్)లో బోలెడు క్లాసులు అందుబాటులో ఉన్నాయి. వీటి ఆధారంగా సొంతంగా ప్రిపేర్‌కావొచ్చు. సన్నద్ధతలో ఎక్కడా ఒత్తిడికి లోనుకాకుండా, నిరుత్సాహపడకుండా సొంత నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ చదవడం లాభిస్తుంది. నేను గ్రూప్స్, సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్న విషయం మా ఇంట్లో తెలియదు. నా నుంచి ఫలితాలు ఆశించే వారు లేకపోవడం వల్ల ఒత్తిడి లేకుండా చదివాను.
నా విజయంలో వీరు :
గ్రూప్-1 ప్రిపరేషన్‌లో భాగంగా సాక్షి భవిత, విద్య, సాక్షిఎడ్యుకేషన్ వెబ్‌సైట్ మొదలు ఇతర పోటీ పరీక్షల వెబ్‌సైట్లు ఉపయోగపడ్డాయి. నేను ఎక్కువగా ఇంటర్నెట్‌పైనే ఆధారపడ్డాను. ఇండియన్ హిస్టరీకి స్పెక్ట్రమ్ పబ్లికేషన్, ఆంధ్ర హిస్టరీ పూర్తిగా ఇంటర్నెట్‌లో చదువుకున్నాను. ఇంటర్నెట్‌లో దొరికే సమాచారం ఆధారంగా సొంత నోట్స్ రాసుకున్నా. పాలిటీకి లక్ష్మీకాంత్ పుస్తకం ఉపయోగపడింది. ఇండియన్ ఎకానమీకి రమేష్‌సింగ్ పుస్తకం, ఆంధ్ర ఎకానమీకి ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే మాత్రమే రిఫర్ చేశాను. ఈ సర్వేను ఔపోసన పట్టా. భూసంస్కరణల గురించి నెట్ నుంచి సమాచారాన్ని సేకరించుకున్నా. సైన్స్ అండ్ టెక్నాలజీకి అధికారిక వెబ్‌సైట్లు, ఇంటర్నెట్‌లోనే చదివి షార్ట్‌నోట్స్ రాసుకున్నాను. మొత్తంగా నా ప్రిపరేషన్ వ్యూహం... తక్కువ మెటీరియల్‌ను పదేపదే చదవడం లాభించింది.
ఇంటర్వ్యూలో...
నా ఇంటర్వ్యూలో జాబ్ ప్రొఫైల్‌పై ప్రశ్నలు అడుగుతారనుకున్నాను. కానీ, జనరల్ ప్రశ్నలే ఎదురయ్యాయి. ఇంటర్వ్యూ 20-25 నిమిషాల పాటు జరిగింది. ఇందులో ఆర్‌డీవోగా ఎంపికైతే మీరు ఏ పనులు చేస్తారు? ఎంటెక్‌లో ఎందుకు చేరలేదు?, పీఎస్‌యూల్లో (ఐఓసీఎల్-ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్‌యూ)) ఉద్యోగం వదులుకొని పరిపాలన సంబంధిత విభాగాల్లో పనిచేయడానికి ఎందుకొస్తున్నారు? పీఎస్‌యూలతో పోల్చుకుంటే ఈ ఉద్యోగంలో జీతభత్యాలు తక్కువగా ఉంటాయి. సర్దుకుంటారా? సివిల్స్‌కు ఎందుకు ప్రిపేర్ అవ్వడం లేదు? ప్రత్యేక హోదా, స్పెషల్ ప్యాకేజీలపై ప్రశ్నలు అడిగారు.
మూడో ర్యాంకుతో నాకు సీటీవో (కమర్షియల్ టాక్స్ ఆఫీసర్) ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం నెల్లూరులో శిక్షణలో ఉన్నా. సివిల్స్‌కు సన్నద్ధమవ్వతున్నా. ఐఏఎస్ సాధించడం నా లక్ష్యం. నేటి యువత ఎంటర్‌టైన్‌మెంట్‌కు ప్రాధాన్యత ఇస్తోంది. అయితే జీవితంలో స్థిరపడిన తర్వాతే వినోదం గురించి ఆలోచించాలనేది నా సలహా.

Published date : 13 Aug 2018 03:28PM