మ్యాథ్స్ మీద మక్కువతోనే ‘నెట్’లో విజయం
Sakshi Education
ఇంటర్మీడియట్ పూర్తికాగానే అందరిలా ఇంజనీరింగ్ వైపు కాకుండా తన అక్క సలహా మేరకు మ్యాథమెటిక్స్‌లో ఇంటిగ్రేటెడ్ పీజీ చేయాలని నిశ్చయించుకుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సీటు సంపాదించింది. మ్యాథ్స్ మీద మక్కువకు రీసెర్చ్ చేయాలనే ఆసక్తి కూడా తోడైంది. జాతీయ స్థాయిలో డిసెంబర్ - 2015లో నిర్వహించిన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్-నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీఎస్‌ఐఆర్-నెట్)లో మొదటి ర్యాంకు సాధించారు బండి ప్రసూన రెడ్డి. సీఎస్‌ఐఆర్-నెట్ పరీక్షలో విజయం సాధించటం సులువే అంటున్న ప్రసూన సక్సెస్ స్టోరీ ఆమె మాటల్లోనే...
మాది కడప. నాన్న పెద్ద రెడ్డప్ప బిజినెస్ చేస్తారు. అమ్మ ఉమాదేవి గృహిణి. అక్క హైందవి ఇంజనీరింగ్ పూర్తిచేసి ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం చేస్తోంది. నేను ఆరో తరగతి వరకు కడపలో స్థానిక వైట్ రోస్ హైస్కూల్‌లో చదివాను. తర్వాత నా విద్యాభ్యాసం అంతా హైదరాబాద్‌లోనే సాగింది. పదో తరగతిలో 91 శాతం మార్కులు వచ్చాయి. ఇంటర్మీడియట్‌లో 97 శాతం మార్కులు సాధించాను. చిన్నప్పటి నుంచి నాకు మ్యాథ్స్ అంటే ఇష్టం. దాంతో ఇంటర్‌లో ఎంపీసీ తీసుకున్నాను. ఇంటర్ తర్వాత ఎంసెట్ రాస్తే 4000 ర్యాంకు వచ్చింది. ఆ ర్యాంకుతో మంచి ఇంజనీరింగ్ కాలేజ్‌లో సీటు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ.. అక్క సలహా మేరకు మ్యాథ్స్‌లో ఇంటిగ్రేటేడ్ ఎమ్మెస్సీ చేయాలని నిర్ణయించుకున్నాను. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) నిర్వహించిన ఇంటిగ్రేటేడ్ ఎమ్మెస్సీ ప్రవేశ పరీక్ష రాశాను. తర్వాత ఇంటర్వ్యూ నిర్వహించి ప్రవేశం కల్పించారు. ప్రస్తుతం ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను.
ప్రత్యేకంగా సన్నద్ధమవ్వలేదు...
నాకు మొదటి నుంచి మ్యాథ్స్ అంటే ఆసక్తి ఉండడం, యూనివర్సిటీలో మంచి ఫ్యాకల్టీ అందుబాటులో ఉండడంతో సీఎస్‌ఐఆర్ - నెట్‌లో ర్యాంకు సాధించడం పెద్ద కష్టమేమి కాలేదు. సీఎస్‌ఐఆర్ - నెట్ పెద్ద క్లిష్టంగా ఉండదు. ఎవరైనా సులువుగానే సాధించవచ్చు. నేనైతే సీఎస్‌ఐఆర్ - నెట్‌కు ప్రత్యేకంగా ప్రిపేర్ అవ్వలేదు. క్లాస్‌రూంలో వినడం.. సందేహాలు ఉంటే ఫ్యాకల్టీని అడిగి నివృత్తి చేసుకోవడం, స్నేహితులతో సబ్జెక్ట్ గురించి చర్చించటం వంటివి చేశాను. ఎలాంటి కోచింగ్ కూడా తీసుకోలేదు.
ప్రీవియస్ పేపర్ల ప్రాక్టీస్‌తో...
సీఎస్‌ఐఆర్ నిర్వహించిన నెట్ ప్రీవియస్ ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయడం ఉపకరించింది. ముఖ్యంగా ప్రశ్నల క్లిష్టత స్థాయి తెలుసుకోవడం, సమయ నిర్వహణ కూడా తెలుస్తుంది. సీఎస్‌ఐఆర్ నెట్‌కు సన్నద్ధమయ్యే విద్యార్థులు ముఖ్యంగా ప్రాథమిక అంశాలపై పట్టు సాధించి, తర్వాత ప్రామాణిక పుస్తకాల్లోని ప్రశ్నలు ప్రాక్టీస్ చేయాలి. ప్రీవియస్ పేపర్లను కూడా ప్రాక్టీస్ చేస్తే లాభిస్తుంది.
2014 నెట్‌లో 64వ ర్యాంకు...
సీఎస్‌ఐఆర్-నెట్ స్కోరుకు రెండేళ్ల వ్యాలిడిటీ ఉంటుంది. 2014 డిసెంబర్‌లో నిర్వహించిన సీఎస్‌ఐఆర్ -నెట్‌లో 64వ ర్యాంకు వచ్చింది. అంతకంటే మెరుగైన ర్యాంకు సాధించాలనే ఈసారి కూడా సీఎస్‌ఐఆర్ -నెట్‌కు హాజరయ్యాను. ఈసారి ఎగ్జామ్ గతంతో పోల్చితే బాగా రాశాను. మంచి ర్యాంకు వస్తుందని ఆశించాను... ఫస్ట్ ర్యాంకు వచ్చే సరికి చాలా ఆనందంగా ఉంది.
పార్ట్ సి మీద ఫోకస్
సీఎస్‌ఐఆర్ - నెట్ ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ విధానంలో మూడు పార్టులుగా ఉంటుంది. పార్ట్ ఎ ఆప్టిట్యూడ్‌కు సంబంధించి అన్ని సబ్జెక్టుల వారికి కామన్‌గా ఉంటుంది. పార్ట్ బి, సిలలో సబ్జెక్ట్ అంశాలుంటాయి. పార్ట్ ఎ, బిలకు రుణాత్మక మార్కులు ఉంటాయి. పార్ట్ సి లోని ప్రశ్నలకు రుణాత్మక మార్కులు ఉండవు. ఈ సెక్షన్‌లో ప్రశ్నలు చాలా లోతుగా అడుగుతారు. మంచి స్కోరు సాధించాలంటే పార్ట్ బి, సి సెక్షన్లలోని ప్రశ్నలపై దృష్టి సారించాలి. పార్ట్ సి లోని ఒక్కో ప్రశ్నకు 4.75 మార్కులు, పార్ట్ బిలోని ఒక్కో ప్రశ్నకు మూడు మార్కులు ఉంటాయి. నేను పార్ట్ బి, సి లపై ఎక్కువ ఫోకస్ చేశాను. 200 మార్కులకు 158 మార్కులు వచ్చాయి.
టీఐఎఫ్‌ఆర్‌లో జాయిన్ అవుతా...
ముంబైలోని ప్రముఖ టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్‌ఆర్)లో ఈ ఏడాది జూలైలో పీహెచ్‌డీ జాయిన్ అవుతా. ప్రస్తుతానికి ఎలాంటి గోల్స్ పెట్టుకోలేదు. రీసెర్చ్ చేసి టీచింగ్ ఫీల్డ్ వెళ్లే ఆలోచన ఉంది. నా విజయంలో నా తల్లిదండ్రలు, అక్క హైందవి పాత్ర ఎనలేనిది. వాళ్ల ప్రోత్సాహంతోనే ఫస్ట్ ర్యాంకు సాధించగలిగాను.
అకడమిక్ ప్రొఫైల్

పదో తరగతి | 93 శాతం (2008 - 2009) |
ఇంటర్మీడియట్ | 98.1 శాతం (2009 - 2011) |
ఇంటిగ్రేటేడ్ పీజీ | 9.2 సీజీపీఏ (ఈ సెమిస్టర్ వరకు) |
Published date : 15 Apr 2016 12:19PM