కసి+కృషి =విజయం:ఐఎఫ్‌ఎస్ టాపర్ తిరుమల రవి కిరణ్
Sakshi Education
ఇంజనీరింగ్ పూర్తవగానే ఆ యువకుడికి ఆకర్షణీయమైన ఉద్యోగం, లక్షల్లో వేతనం లభించాయి.. కొన్నేళ్లు పనిచేశాక ఎందుకనో మనసు ఆ ఉద్యోగంపై నిలవలేదు. ఏదో తెలియని అసంతృప్తి.. ఇంకా ఏదో సాధించాలనే తపన. దాంతో చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకున్నాడు. ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌పై గురిపెట్టాడు. లక్ష్యం కోసం పట్టుదలగా ప్రయత్నించాడు. కసి+కృషి తోడై విజయం వరించింది. జాతీయ స్థాయిలో 11వ ర్యాంక్ సొంతమైంది. మొదటి ప్రయత్నంలోనే ఐఎఫ్‌ఎస్ టాపర్‌గా నిలిచిన ఆ యువకుడే అనంతపురం జిల్లాకు చెందిన తిరుమల రవి కిరణ్. ఆయనతో భవిత ప్రత్యేక ఇంటర్వ్యూ...
పట్టుదలగా చదివా:
జాతీయ స్థాయిలో టాప్ ర్యాంక్ సాధించడం చాలా సంతోషంగా ఉంది. లక్షల్లో జీతాన్నిచ్చే సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని వదిలి.. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పరీక్ష రాయాలనుకున్నప్పుడు విజయం సాధించగలనా? లేదా? అనే అనుమానం ఏర్పడింది. కాని కష్టపడి పట్టుదలగా చదవడంతో అనుకున్నది సాధించగలిగాను. పరీక్షకు సొంతంగా ప్రిపరేషన్ సాగించాను. పరీక్ష రాశాక మంచి స్కోరింగ్ చేస్తాననే నమ్మకం కలిగింది. కాని జాతీయస్థాయిలో 11వ ర్యాంకర్‌గా నిలుస్తానని ఊహించలేదు. జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే సంఘటన ఇది.
సాఫ్ట్‌వేర్‌ను వదిలి ఐఎఫ్‌ఎస్‌కు:
మాది అనంతపురంజిల్లా, బుక్కపట్నం. నాన్న రిటైర్డ్ రైల్వే ఉద్యోగి. అమ్మ గృహిణి. సోదరుడు సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. టెన్త్ నుంచి ప్లస్ టూ, ఆ తర్వాత బీటెక్ (ఈఈఈ) ఇలా నా చదువంతా హైదరాబాద్‌లోనే సాగిం ది. బీటెక్ తర్వాత డెలాయిట్ కంపెనీలో జాబ్ వచ్చింది. అక్కడ రెండేళ్లు పనిచేశాను. కాలం గడుస్తున్నకొద్దీ చేస్తున్న ఉద్యోగంపై అసంతృప్తి పెరిగిపోయింది. అందుకే ఆ ఉద్యోగాన్ని వదిలేసుకున్నా. ఆ తర్వాత యూపీఎస్సీ సివిల్స్ పరీక్ష రాశాను. 2011 జూలైలో యూపీఎస్సీ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ నోటిఫికేషన్ రావడంతో దరఖాస్తు చేశాను. వాస్తవానికి అటవీ విభాగంలో ఉద్యోగం సవాళ్లతో కూడుకుని ఉంటుంది. ఇది నాకు ఇష్టం. అంతేకాదు.. పర్యావరణాన్ని కాపాడటంలో అడవుల పాత్ర ఎంతో కీలకం. అందుకే అటవీ సంరక్షణకు నా వంతు బాధ్యతగా పనిచేయడంకోసం ఈ సర్వీసు వైపు మొగ్గుచూపాను.
రివిజన్‌తో ఎంతో మేలు:
యూపీఎస్సీ నిర్వహించే ఐఎఫ్‌ఎస్ పరీక్షలో మొత్తం ఆరు పేపర్లుంటాయి. నాలుగు పేపర్లు ఆప్షనల్ సబ్జెక్టులపై ఉంటాయి. నా ఆప్షనల్ సబ్జెక్టులు మ్యాథ్స్, ఫిజిక్స్. ఐఎఫ్‌ఎస్ సర్వీసుకు ఎంపికవాలంటే.. రాత పరీక్షలో ఎక్కువ స్కోర్ చేయాలి. అందుకోసం మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులు బాగా ఉపయోగపడతాయి. అందుకే ఐఎఫ్‌ఎస్‌కు ప్రిపరేషన్ మొదలుపెట్టినప్పటి నుంచీ ఈ రెండు సబ్జెక్టులపై బాగా దృష్టి సారించాను.
ప్రిపరేషన్‌లో భాగంగా ఎప్పటి సబ్జెక్టులు అప్పుడే రివిజన్ చేసేవాడిని. చదివిన సబ్జెక్టు సాధ్యమైనంత వేగంగా రివిజన్ చేయకపోతే మర్చిపోయే ప్రమాదం ఉంది. అందుకే కోచింగ్ క్లాసులతోపాటు, సొంతంగా చదువుకున్న సబ్జెక్టులను తిరిగి వారంలోపే రివిజన్ చేసేవాడిని. దాంతో సబ్జెక్టుపై పట్టుపెరిగి.. ప్రశ్నలు ఏవిధంగా అడిగినా సమాధానం రాయగలిగేలా సిద్ధమయ్యాను. అదేవిధంగా పేపర్ 1, 2 జనరల్ ఇంగ్లిష్, జనరల్ స్టడీస్‌కు సొంతంగానే చదువుకున్నా. పేపర్ 2 కోసం ఎక్కువగా పత్రికలు, మ్యాగజైన్లపై ఆధారపడ్డా. వీటిని తరచుగా ఫాలో అవడం వలన మంచి స్కోరింగ్ చేయగలిగాను.
సొంత నోట్స్:
పరీక్షకు మూడున్నర నెలల ముందు నుంచి ప్రిపరేషన్ మొదలు పెట్టాను. ఆప్షనల్ సబ్జెక్టుల్లో పట్టుకోసం పాఠ్యపుస్తకాలు బాగా చదివి సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా. అదేవిధంగా పాత ప్రశ్నపత్రాల పరిశీలన బాగా ఉపయోగపడింది. జనరల్ స్టడీస్ పేపర్లో జాగ్రఫీ సబ్జెక్టుపై ఎక్కువ ప్రశ్నలు అడుగుతుండటాన్ని గమనించాను. దీంతో ఆ సబ్జెక్ట్ కోసం ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు చదివాను. పత్రికలు, మ్యాగజైన్లు బాగా చదివాను. మ్యాథ్స్‌కు కృష్ణా సిరీస్ పుస్తకాలు చదివాను. ఒక్కో చాప్టర్‌కు ఒక్కో బుక్ చొప్పున అన్ని చాప్టర్లకు బుక్స్ ఫాలో అయ్యా. ఫిజిక్స్ సబ్జెక్టుకోసం క్వాంటమ్ ఫిజిక్స్- జెట్లీ, ఎలక్ట్రో మేగ్నటిక్ థియరీ బుక్ -గ్రిఫిట్, న్యూక్లియర్ ఫిజిక్స్-పటేల్ వంటి పుస్తకాలు చదివాను. రోజుకు ఏడు గంటలపాటు ప్రిపరేషన్ సాగించాను.
హాబీల గురించి:
అయిదుగురు సభ్యుల బృందం సుమారు 20 నిమిషాలపాటు ఇంటర్వ్యూ చేసింది. ప్రధానంగా సమకాలీన అంశాలపై ప్రశ్నలు అడిగారు. దీంతోపాటు వ్యక్తిగత హాబీలు, విద్యా నేపథ్యం ఆధారంగా ప్రశ్నలు అడిగారు. డెలాయిట్ కంపెనీలో నేను చేసిన ఉద్యోగానికి సంబంధించి కూడా పలు ప్రశ్నలు అడిగారు.
అడిగిన ప్రశ్నలివే:
* ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎంచుకోవడానికి కారణం?
* ఫారెస్ట్ సర్వీసులో మీకు ఇష్టమైన విభాగం?
* జీవ వైవిధ్యం అంటే?
* కార్బన్ క్రెడిట్స్ వివరించండి?
* మీ హాబీల గురించి చెబుతారా?
* మ్యూజిక్ అంటే ఇష్టం అన్నారుకదా.. పేరొందిన కొన్ని పాటలు, వాటి రచయితల పేర్లు చెప్పగలరా?
సరైన మెటీరియల్‌తోనే సక్సెస్:
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌కు ఎంపికవడం పెద్ద కష్టంకాదు. కనీసం నాలుగు లేదా అయిదు నెలల ముందు నుంచీ ప్రిపరేషన్ మొదలుపెడితే... విజయం ఖాయం చేసుకోవచ్చు. పేపర్లవారీగా సబ్జెక్టులను అర్థం చేసుకుని సరైన మెటీరియల్‌ను చదివితే మంచి స్కోరింగ్ చేయొచ్చు!!

Published date : 12 Apr 2012 02:29PM