Skip to main content

జేఈఈ అడ్వాన్‌‌సడ్‌లో జాతీయస్థాయిలో సెకండ్‌ ర్యాంకు.. రవిచంద్ర సక్సెస్‌ స్టోరీ --!

ఏకాగ్రత.. ఓర్పులతో గెలుపు

‘‘పరీక్షరాసే ఆరుగంటలపాటు ఓర్పుగా ఉండగలగటం.. ఒత్తిడికి గురికాకుండా
ఏకాగ్రతతో ప్రశ్నపత్రంలో ఇచ్చిన అంశాలకు సమాధానం ఇవ్వగలిగేలా నన్ను నేను
మలచుకోవటమే’’ జేఈఈ అడ్వాన్‌‌సడ్‌లో జాతీయస్థాయిలో సెకండ్‌ ర్యాంకు
సాధించటానికి కారణాలు అంటున్నాడు అద్దంకి రవిచంద్ర. ర్యాంకులు.. అవార్డులు..
రివార్డులు సాధించటం ఆరోతరగతి నుంచే ప్రారంభమైందంటూ.. తన విజయ
ప్రస్థానాన్ని సాక్షి-భవితతో పంచుకున్నాడు. రవిచంద్ర సక్సెస్‌ స్టోరీ ఆయన మాటల్లోనే..
మా స్వస్థలం ప్రకాశం జిల్లా, ఒంగోలు. నాన్న ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లోనే ఉంటున్నాం. నాన్న ఎ.వి.నాగేశ్వరరావు ఏజీ ఆఫీసులో అసిస్టెంట్‌ అకౌంటెంట్‌ ఆఫీసర్‌. అమ్మ పద్మజ స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో స్పెషల్‌ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు. అన్నయ్య రాఘవేంద్ర చెనై్న ఐఐటీలో కంప్యూటర్‌ సైన్‌‌స మూడో సంవత్సరం చదువుతున్నాడు.

ఆరో తరగతి నుంచే.. మొదలై:
ఆరోతరగతిలో మ్యాథ్‌‌స, కెమిస్ట్రీ అంటే నాలో ఉన్న ఆసక్తిని గమనించిన అమ్మానాన్న.. ఎక్కడ ఏ పోటీపరీక్ష జరిగినా నన్ను తీసుకెళ్లేవారు. ముఖ్యంగా పేరు నమోదు చేయటం దగ్గర నుంచి హాల్‌టికెట్‌ వరకూ ఎంతో ఓర్పుగా నాన్న తెచ్చేవారు. అమ్మానాన్న ఇచ్చిన ప్రోత్సాహంతో చదువుతోపాటు ప్రతి పోటీపరీక్షకు వెళ్లేవాణ్ని. ఆరోతరగతి చదువుతున్నపుడు కెమిస్ట్రీలో శిక్షణనిప్పించారు. అది నాకు బాగా ప్లస్‌ అయింది. ఫిజిక్‌‌స, కెమిస్ట్రీ, మ్యాథ్‌‌సలో చాలా బహుమతులు గెలుచుకున్నా. 9, 10వ తరగతుల్లో డాక్టర్‌ ఎ.ఎస్‌.రావు అవార్డును గెలిచా. ఏషియన్‌ ఫిజిక్‌‌స ఒలంపియాడ్‌లో ఇండియా నుంచి ఆరుగురు విద్యార్థులు ఎంపికైతే.. వారిలో నేనూ ఒకడిని కావటం మరచిపోలేని జ్ఞాపకం. టెన్‌‌తలో వివిధ స్కూల్‌‌స నిర్వహించిన టాలెంట్‌ టెస్టుల్లో నాలుగు ల్యాప్‌టాప్‌‌స బహుమతులుగా లభించాయి. పదో తరగతిలో 569/600, ఇంటర్‌లో 968/1000 మార్కులు వచ్చాయి.

ఐఐటీ లక్ష్యంగా..ప్రిపరేషన్‌
పదోతరగతి నుంచే ఐఐటీ ఫౌండేషన్‌ క్లాసులు ఉండేవి. మూడు భాగాలుగా బోధన జరిగేది. ఇంటర్‌కు వచ్చాక మొదటి సంవత్సరం మ్యాథ్‌‌స, ఫిజిక్‌‌స, కెమిస్ట్రీ సబ్జెక్టులలో టాపిక్‌‌స చెప్పేవారు. ప్రతి శని, ఆదివారాలు పరీక్షలుండేవి. అక్కడ వచ్చిన మార్కులనుబట్టి ఏయే సబ్జెక్టుల్లో వెనుకబడ్డామో గుర్తించేవారు. వాటికి కారణాలను విశ్లేషించి కౌన్సెలింగ్‌ చేసేవారు. ఆయా సబ్జెక్టుల్లో మంచి స్కోరు చేసేందుకు వీలుగా ప్రత్యేక క్లాసులు ఉండేవి. రెండో సంవత్సరంలో గ్రాండ్‌ టెస్టులు నిర్వహించేవారు.. 60 గ్రాండ్‌ టెస్టుల వరకూ రాసేవాళ్లం. జేఈఈ ప్రశ్నాపత్రం ఎంత కష్టంగా ఉంటుందో.. గ్రాండ్‌ టెస్టుల్లో ఇచ్చే ప్రశ్నలన్నీ అంతే క్లిష్టంగా ఉండేవి. గ్రాండ్‌ టెస్టుల్లో దొర్లిన తప్పులను జాబితాగా రాసి సమీక్షించి పొరపాట్లను సరిదిద్దేవారు. గ్రాండ్‌ టెస్టుల్లో టాప్‌లో ఉన్నారంటే.. గ్యారంటీగా ర్యాంకు సాధించినట్లే లెక్క. గ్రాండ్‌ టెస్టుల్లో ఎప్పుడూ టాప్‌లో ఉండటం వల్ల వందలోపు ర్యాంకు వస్తుందనే నమ్మకం ఉండేది. ఐఐటీలో వందలోపు ర్యాంకు వస్తుందని నాన్న అనడం కూడా నాలో ఆత్మవిశ్వాసం పెంచింది.

మరింత పట్టుకోసం.. చదివిన పుస్తకాలివే:
మొత్తమ్మీద రోజూ ఉదయం 6గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకూ చదివేవాణ్ని. ఐఐటీ లక్ష్యంగా సబ్జెక్టులో మరింత పట్టుసాధించేందుకు, మంచి స్కోరు చేసేందుకు.. మ్యాథ్‌‌స- టి.ఎం.హెచ్‌ పబ్లికేషన్‌‌స బుక్‌‌స, ఫిజిక్‌‌సలో ఇరోడవ్‌, హె.సి.వర్మ ఫండ్‌మెంటల్‌‌స ఇన్‌ ఫిజిక్‌‌స వాల్యూమ్‌ 1, 2, ఫిజికల్‌ కెమిస్ట్రీ బహదూర్‌, ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో హిమాన్షుపాండే, ఇన్‌ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ ఓ.పి.టాండన్‌ పుస్తకాలలో ప్రాబ్లమ్‌‌స చేసేవాణ్ని. ఐఐటీ లక్ష్యంగా చదవటంతో మిగిలిన పరీక్షలు రాయటం చాలా తేలికైంది. ఐఐటీ శిక్షణలో మ్యాథ్‌‌స, ఫిజిక్‌‌స, కెమిస్ట్రీ పాఠ్యాంశాలు ఇంటర్‌ సిలబస్‌ కంటే ఎక్కువగా ఉంటాయి. ఎంసెట్‌లో సిలబస్‌ కొంచెం మారుతుంది. ఇంటర్‌ ఇంగ్లిష్‌, సంస్కృతం కోసం రెండు వారాలు చదివాను.

టానిక్‌లా ప్రోత్సాహం:
ఇంటర్‌ ఫస్టియర్‌లో ఫిజిక్‌‌స లెక్చరర్‌ నన్ను చాలా తెలివైన వాడినంటూ ఇచ్చిన ప్రోత్సాహం ఫిజిక్‌‌సపై ఆసక్తిని మరింత పెంచింది.

ఆనందంగా.. ఐఐటీ ముంబైలో:
ఐఐటీలో చేరాలని మనసులో ముద్రపడినప్పటి నుంచే టాప్‌-100లో ఉంటానని అనుకునేవాణ్ని. అయితే సెకండ్‌ ర్యాంకు రావటం చాలా ఆనందంగా ఉంది. నా కంటే కూడా అమ్మానాన్న ఎక్కువగా సంతోషిస్తున్నారు. జేఈఈ అడ్వాన్‌‌సడ్‌లో 2వ ర్యాంకుతోపాటు ఎంసెట్‌లో 9వ ర్యాంకు. బిట్‌శాట్‌లో 36వ ర్యాంకు సాధించా. ఐఐటీ, ముంబైలో చేరాలనుకుంటున్నా. అక్కడ నాకు ఇష్టమైన కంప్యూటర్‌ సైన్‌‌సలో చేరతా. రొటీన్‌గా చదువు పూర్తయ్యాక ఉద్యోగం చేస్తూ నాలుగు గోడలకే పరిమితం కావాలనుకోవడం లేదు. కంప్యూటర్‌‌సపై పరిశోధనలు చేసి.. ఏదైనా ఆవిష్కరణ చేయాలనుకుంటున్నా. రీసెర్‌‌చ కొనసాగిస్తూ టీచింగ్‌ చేసేందుకు వీలుగా కెరీర్‌ను ప్లాన్‌ చేసుకుంటాను.

ఓర్పు కావాలి.. సాధన చేయాలి:
జేఈఈలో ర్యాంకు సాధించటం అంత తేలికకాదు. లక్షల మందితో పోటీపడుతున్నపుడు ఓర్పు, సబ్జెక్టులపై పట్టు కీలకం.
ఐఐటీ జేఈఈ గత ప్రశ్న పత్రాలు చూసినపుడు చాలా తేలిగ్గా అనిపిస్తాయి. కాని వాస్తవంలో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. పరీక్ష హాలులో వాతావరణం వేరుగా ఉంటుంది. బల్లలు, వెలుతురు అనువుగా ఉండకపోవచ్చు. ఇవన్నీ పరీక్షపై ప్రభావం చూపేవే.
ప్రతి సబ్జెక్టు కాన్సెప్‌‌ట్సపై లోతైన అధ్యయనం చేయాలి. బలహీనంగా ఉన్న సబ్జెక్టుకు ఎక్కువ సమయం కేటాయించాలి.
జేఈఈ పరీక్షలో వచ్చే ప్రశ్నల్లో అధికభాగం సైంటిఫిక్‌ అంశాలే ఉంటాయి. మ్యాథ్‌‌స బాగా ప్రాక్టీసు చేయాలి .మ్యాథ్‌‌సలో కాలిక్యులస్‌, లిమిట్‌‌స, డిఫ్రెన్సియేషన్‌, ఇంటిగ్రేషన్‌ వంటి అంశాల్లో ఎక్కువ ప్రశ్నలుంటాయి. మొన్న జరిగిన జేఈఈలో ‘లిమిట్‌‌స’పై ఇచ్చిన ప్రశ్నకు ఏ ఒక్క విద్యార్థి సరైన సమాధానం ఇవ్వలేకపోయాడు.
మోడరన్‌ ఫిజిక్‌‌స, ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో పట్టు సాధిస్తే మంచి స్కోరు చేసే వీలుంది.
ముఖ్యంగా ఆరు గంటలు ఒకేచోట కూర్చుని పరీక్షరాయటం. దానికి ఎంతో ఓర్పుకావాలి. దీనికి తగినట్లుగా ముందు నుంచీ ప్రిపేరైతే పరీక్షను అలవోకగా అధిగమించవచ్చు. ఆరుగంటలు కూర్చునే ఓర్పు రావాలంటే.. మైండ్‌సెట్‌ను సిద్ధంచేసుకోవాలి. 20-30 గ్రాండ్‌ టెస్టులు సీరియస్‌గా రాయాలి. రాసిన తర్వాత తప్పులను గుర్తించి సవరించుకోవాలి. అప్పుడే ర్యాంకు సాధించగలరు.
Published date : 28 Jun 2013 11:04AM

Photo Stories