గ్రూప్ 1 ఫలితాల వెల్లడి-టాపర్‌గా రెండో జోన్ అభ్యర్థి
Sakshi Education
శ్రీకాకుళం డిప్యూటీ తహసీల్దారుకు రెండో స్థానం
గ్రూప్ 1 ఫలితాలను ఏపీపీఎస్సీ శుక్రవారం ప్రకటించింది. మొత్తం 210 పోస్టులకు గాను 1:2 నిష్పత్తిలో 417 మంది అభ్యర్థులకు జనవరి 4 నుంచి ఫిబ్రవరి 10 వరకు సింగిల్ బోర్డు ఇంటర్వ్యూలు నిర్వహించింది. మొయిన్స్, ఇంటర్వ్యూ మార్కులు (825) కలిపి శుక్రవారం తుది ఫలితాలు విడుదలయ్యాయి. బీసీ(డి) కేటగిరీకి చెందిన రెండో జోన్ అభ్యర్థి (హాల్‌టికెట్ నంబర్ 10500269) 575.62 మార్కులతో టాపర్‌గా నిలిచారు. ఈయన పేరు తెలియరాలేదు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన బీసీ(ఎ) కేటగిరీ అభ్యర్థి దొడ్డ శ్రీనివాస్ (మొదటి జోన్) అభ్యర్థి 566.12 మార్కులతో రెండోస్థానంలో నిలిచారు (హాల్‌టికెట్ నంబర్ 10101279). ఈయన ప్రస్తుతం శ్రీకాకుళంలో డిప్యూటీ తహసీల్దారుగా పని చేస్తున్నారు. మూడో స్థానంలో నిలిచిన అభ్యర్థి (10100515)కి 563.62 మార్కులు వచ్చాయి. ఖమ్మం జిల్లా ఇల్లెందు డీఎస్పీగా పని చేస్తున్న తేజ్‌భరత్ 563.37 మార్కులతో 4వ స్థానం సాధించారు. మొత్తంమీద 8 మంది అభ్యర్థులు 550కి మించి మార్కులు సాధించారు.
బీసీ(డి) కేటగిరీకి చెందిన ఐదో జోన్ అభ్యర్థి 541 మార్కులతో మహిళల్లో టాపర్‌గా నిలిచారు. ఈమె పేరు కూడా తెలియరాలేదు. డీఆర్‌డీఓలో స్టెనోగ్రాఫర్‌గా పని చేస్తున్న వరంగల్ జిల్లాకు చెందిన వై.అనిల్‌కుమార్ 8వ స్థానం, గుంటూరు జిల్లా తెనాలికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఎం.జయకృష్ణ 9వ స్థానంలో నిలిచారు. ధ్రువీకరణ పత్రాలు సమర్పించని 16 మంది అభ్యర్థుల మార్కులను వెల్లడించలేదు. అయితే ఈ ఫలితాలు కేవలం మార్కుల జాబితా మాత్రమేనని, ర్యాంకింగ్ జాబితా కాదని ఏపీపీఎస్సీ ప్రకటించింది. వీరిలో మార్కులు, రిజర్వేషన్లు, ఖాళీల ఆధారంగా అర్హత సాధించిన తొలి 210 మందికి పోస్టింగులిస్తారు. ట్రిబ్యునల్ తుది తీర్పునకు లోబడి ఎంపిక ప్రక్రియ ఖరారవుతుంది.
13న తదుపరి విచారణ
గ్రూప్ 1 ప్రశ్నపత్రాల్లో తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందని, ప్రశ్నల్లో అనువాద దోషాలను పరిగణనలోకి తీసుకోకపోవడంతో ఇంగ్లీషు మీడియం అభ్యర్థులకు ఎక్కువ మేలు జరిగిందని ఆరోపిస్తూ తెలుగు మీడియం అభ్యర్థులు గతంలో ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. దీంతో మౌఖిక పరీక్షలపై ట్రిబ్యునల్ స్టే విధించింది. దానిపై ఏపీపీఎస్సీ హైకోర్టును ఆశ్రయించగా.. తుది ఉత్తర్వులిచ్చే వరకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా కేవలం ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు ఏపీపీఎస్సీకి జనవరి 2న హైకోర్టు అనుమతిచ్చింది. ట్రిబ్యునల్ తుది తీర్పు అనంతరమే పోస్టింగులివ్వాలని స్పష్టం చేసింది. ప్రశ్నపత్రాల్లో అనువాద దోషాలు రుజువైతే మొత్తం గ్రూప్ 1 ప్రక్రియనే రద్దు చేయాల్సి ఉంటుందని పేర్కొంది.
ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులకు కూడా పత్రికాముఖంగా ఈ విషయాన్ని తెలియజేయాలని సూచించింది. ఈ కేసు ట్రిబ్యునల్‌లో ఈ నెల 13న మరోసారి విచారణకు రానుంది. అభ్యర్థుల జవాబు పత్రాలను, మూల్యాంకనంలో తెలుగు మీడియం అభ్యర్థులకు వచ్చిన మార్కుల్లోని వ్యత్యాసాలను నిపుణుల సమక్షంలో న్యాయమూర్తులు పరిశీలించనున్నారు. ఒకే పోటీ పరీక్షలో రెండు వేర్వేరు రకాల ప్రశ్న పత్రాలున్నాయన్న అభ్యర్థుల ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టనున్నారు.
రోజుకు 12 గంటలు చదివా
‘‘రెండో ర్యాంక్ రావడం సంతోషంగా ఉంది. 8 నెలల ముందునుంచే ప్రిపరేషన్ మొదలుపెట్టా. ఎక్కడా కోచింగ్‌కు వెళ్లలేదు. రోజుకు 12 గంటల చొప్పున పట్టుదలగా చదివా. 2009లో డిప్యూటీ తహసీల్దార్‌గా ఎంపికయ్యాను. ఐఏఎస్ కావాలన్నది చిన్ననాటి కల. దాన్ని ఎప్పటికైనా నెరవేర్చుకుంటా’’
- దొడ్డ శ్రీనివాస్
రెవెన్యూ సర్వీసంటే చాలా ఇష్టం
‘‘గతంలో గ్రూప్ 1లో ఆరో ర్యాంకుతో డీఎస్పీగా ఎంపికయ్యా. రెవెన్యూ సర్వీసే ఆశయంగా ఈసారి కష్టపడి చదివా. కోచింగ్‌కు వెళ్లకుండా సొంతగా నోట్స్ ప్రిపేర్ చేసుకుని చదివా’’
-తేజ్‌భరత్
స్టెనోగ్రాఫర్ నుంచి...
‘‘నేను ప్రస్తుతం డీఆర్‌డీవో ల్యాబ్‌లో స్టెనోగ్రాఫర్‌గా చేస్తున్నా. గ్రూప్ 1 అధికారి కావాలనే లక్ష్యంతో ఉద్యోగం చేస్తూనే రోజుకు 10 గంటలకు పైగా కష్టపడి చదివా.’’
- వై.అనిల్‌కుమార్
ఐఏఎస్ అధికారినవుతా
‘‘సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేసినా, పేదలకు సేవ చేసేందుకు గ్రూప్ 1 రాశా. తొలి ప్రయత్నంలోనే ఫలితం వచ్చింది. కష్టమైన పేపర్లకు మాత్రమే కోచింగ్ తీసుకున్నా. ఐఏఎస్ అధికారి కావడమే నా లక్ష్యం’’
- ఎం.జయకృష్ణ

Published date : 13 Feb 2012 05:46PM