ఐఐటీ-జేఈఈలో విజయకేతనం ఎగురవేసిన తెలుగు తేజం పల్లెర్ల సాయిసందీప్‌రెడ్డి సక్సెస్ స్టోరీ--!
Sakshi Education
‘‘పోటీ పరీక్ష అంటే భయపడొద్దు. అది కూడా కాలేజీలో నిర్వహించే గ్రాండ్‌టెస్‌ట లాంటిదే
అనుకోండి. ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా పరీక్షహాలుకు వెళ్లాలి. అప్పుడే విజయం మీ సొంతమవుతుంది.. పక్కా ప్లానింగ్‌తో చదివితే గ్రామీణ విద్యార్థులు సైతం జాతీయస్థాయి పరీక్షల్లో విజయం సాధించొచ్చు’’ అంటున్నాడు ఐఐటీ-జేఈఈలో విజయకేతనం ఎగురవేసిన తెలుగు తేజం పల్లెర్ల సాయిసందీప్‌రెడ్డి. జేఈఈలో ఆలిండియా స్థాయిలో ఫస్‌ట ర్యాంకు సాధించి ఇటు ఎంసెట్‌లోనూ టాపర్‌గా నిలిచిన సందీప్ సక్సెస్ స్టోరీ...
మాది ప్రకాశం జిల్లా పొదిలి. నాన్న పల్లెర్ల లకిష్మనర్సయ్య ప్రభుత్వ ఉపాధ్యాయుడు. అమ్మ రాజ్యలకిష్మ గృహిణి. అక్క నవ్యసింధూరి బీటెక్ నాలుగో సంవత్సరం చదు వుతోంది.
అమ్మానాన్న స్ఫూర్తి:
నాన్న హైస్కూల్ టీచర్ కావడంతో చదువుపట్ల మొదట్నుంచి సలహా ఇచ్చేవారు. అమ్మ రాజ్యలకిష్మ ఇటీవలే బీఈడీ పూర్తిచేశారు. ఇప్పటికీ తనకు చదువుపట్ల ఉన్న ఆసక్తి నాకు స్ఫూర్తి. ఐదోతరగతి వరకూ పొదిలిలో చదివా. ఆరోతరగతి వినుకొండ, 7-10 వరకూ గుడివాడ విశ్వభారతి. ఇంటర్.. శ్రీచైతన్యనారాయణ ఐఐటీ అకాడమీలో చదివాను. 10 తరగతిలో 563 మార్కులు, ఇంటర్‌లో 980 మార్కులు తెచ్చుకున్నా. మ్యాథ్‌స అంటే ఇష్టంతో ప్రతిభా పోటీలకు వెళ్లేవాణ్ని. 8వ తరగతిలో ఆల్‌ఇండియా ఒలింపియాడ్‌లో ఫస్‌ట రావటం నుంచి ఇప్పటి వరకూ అన్నింటా బెస్‌టగానే పేరు తెచ్చుకున్నా. అమ్మానాన్న ఇచ్చిన ప్రోత్సాహమే ర్యాంకు రావడానికి కారణం.
గురుదేవోభవ:
ప్రాక్టీసు సమయంలో... గ్రాండ్‌టెస్టులప్పుడూ అధ్యాపకులు ఎప్పుడూ అందుబాటులో ఉండేవారు. ఏ సబ్జెక్టులో మార్కులు తగ్గినా కారణాలను గుర్తించి మరోసారి ఆ పొరపాటు చేయకుండా సూచనలిచ్చేవారు. ముఖ్యంగా గ్రాండ్‌టెస్టుల్లో వచ్చే ప్రశ్నలన్నీ చాలా టఫ్ గా ఉండేవి. ఎంతో శ్రమిస్తేగానీ వాటికి సమాధానం గుర్తించటం తెలిసేది కాదు. అలా నిరంతరం అధ్యాపకులు ప్రాక్టీసు చేయిస్తూ.. తప్పులు దొర్లినపుడు వాటిని మాతో సరిదిద్దిస్తూ పరీక్షంటే భయం పోగొట్టేవారు.
ఇంటర్ పరీక్షలకు నెల రోజులే చదివా:
నిజం చెప్పాలంటే ఇంటర్ పరీక్షలకు చదివింది కేవలం నెలరోజులే. అది కూడా ఇంగ్లిషు, సంసృ్కతంలో పాసవటం కోసమే. ఐఐటీలో ర్యాంకు సాధనపైనే నా ధ్యాసంతా. మ్యాథ్‌స, ఫిజిక్‌స, కెమిస్ట్రీ సబ్జెక్టులన్నీ ఇంటర్ పరీక్షలకు మించిన సిలబస్ కావటంతో ప్రత్యేకంగా సమయం కేటాయించలేదు. ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకూ మధ్యలో రెండు మూడు గంట లు విశ్రాంతి తీసుకుంటూ సబ్జెక్టుల వారీగా చదివాను.
ఏడాదిలో 30 గ్రాండ్ టెస్టులు రాశా:
ఇంటర్ రెండో సంవత్సరంలో పూర్తి సమయం ఐఐటీకే కేటాయించా. ప్రతి శని, ఆదివారాలూ గ్రాండ్ టెస్టులుండేవి. ఏడాదిలో 30కు పైగా గ్రాండ్‌టెస్టులు రాశా. జేఈఈ పాత మోడల్‌పేపర్లతోపాటు ఇతర విద్యాసంస్థలు రూపొందించిన ప్రశ్నాపత్రాలను ప్రాక్టీసు చేశా. కొత్త ప్రాంతంలో ఉండే పరీక్షహాలుకు అలవాటు పడేందుకు ఆ వాతావరణంలో ఇమిడేందుకు రెండు మూడుసార్లు కొత్త ఇనిస్టిట్యూట్‌సలో పరీక్షలు నిర్వహించారు. దీంతో పరీక్షహాలు ఎక్కడైనా భయపడకుండా మానసికంగా సిద్ధమయ్యా.
అటు చదువు.. ఇటు సినిమాలు:
జాతీయస్థాయి పరీక్షలంటే 24 గంటలూ పుస్తకాలకు అతుక్కుపోవటం కాదు. మ్యాథ్‌స, కెమిస్ట్రీ, ఫిజిక్‌స సబ్జెక్టులను విభజించుకుని ఒత్తిడికి గురైనపుడు విశ్రాంతి తీసుకుంటూ చదవాలి. పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో కొత్తగా రిలీజైన సినిమాలన్నీ చూసేవాణ్ణి. రిలాక్సేషన్ కోసం పుస్తకపఠనం, చెస్ ఆడేవాణ్ణి.
ఈ పుస్తకాలే చదివా:
జేఈఈలో అడిగే ప్రశ్నలకు అనుగుణంగా రూపొందించిన సిలబస్‌ను పూర్తిగా అనుసరించా. మ్యాథ్‌సలో మంచి మార్కులు రావాలంటే రెగ్యులర్ ప్రాక్టీసే కీలకం. మ్యాథ్‌సకు ఆర్.డి.శర్మ, ఎం.టి.జీ సీరిస్, ఫిజిక్‌సకు హెచ్.సి.వర్మ, ఐ.ఈ.ఇరిడోవ్, కెమిస్ట్రీఫిజిక్‌సకు ఎటీకిన్‌స, ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీకి జె.డి.లీ, ఆర్గానిక్‌కు.. వడే జూనియర్ రాసిన పుస్తకాలు చదివాను. వాటిలో ప్రాబ్లమ్‌స సాల్వింగ్.. సబ్జెక్టుపై పట్టు తెచ్చాయి.
గ్రామీణ విద్యార్థుల్లో స్ఫూర్తి నింపితే చాలు:
గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన విద్యార్థిగా ఫస్‌టర్యాంకు సాధించటం గర్వంగా భావిస్తున్నా. టాప్-3లో ఉంటాననుకున్నా. ఫస్‌ట రావటం ఆశ్చర్యం.. ఆనందాన్నిచ్చింది. సబ్జెక్టుపై ఏకాగ్రత ఉంచి చదివితే ఎవరైనా ర్యాంకర్లు కావచ్చు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చదివే విద్యార్థులకు నా ర్యాంకు స్ఫూర్తి నింపితే చాలు.
కొత్త రకం రోబోలు తయారుచేస్తా:
స్కూల్ స్థాయి నుంచి లెక్కలంటే చాలా ఇష్టం. అదే ధ్యాసతో ఐఐటీకి ప్రిపేరయ్యా. ఐఐటీ ముంబైలో కంప్యూటర్‌ససైన్సులో చేరతా. సృజనాత్మకంగా ఏదైనా కొత్త పరి జ్ఞానానికి నా వంతు తోడ్పాటును అందించాలన్నది ఆశ. దాన్ని సాధించేందుకే కంప్యూటర్‌సను కెరీర్‌గా తీసుకున్నా. భవిష్యత్తులో కొత్త రకం రోబోలను తయారుచేయడమే నా లక్ష్యం.
భయం వద్దు.. విజయమే హద్దు:
జేఈఈలో నా మార్కులు 322/360. వాస్తవానికి ఇంకా ఎక్కువ స్కోరు చేయాల్సి ఉంది. తెలిసినా మార్కింగ్ చేయడంలో తప్పుదొర్లటంతో 10 మార్కులు కోల్పోయా.
మ్యాథ్‌సలో 107/120, ఫిజిక్‌సలో 112/120, కెమిస్ట్రీలో 113/120 స్కోర్ చేశాను.
ఈ దఫా మ్యాథ్‌స సబ్జెక్టు చాలా కష్టంగా ఇచ్చారు. మార్కింగ్ చేయటంలో తప్పులు దొర్లి 5 మార్కులు కోల్పోయాను. ఇక ఫిజిక్‌స సెకండ్ పేపర్‌లో కొన్ని ప్రశ్నలు అర్థం కాకపోవటం వల్ల స్కోరు చేయలేకపోయాను. కెమిస్ట్రీలో తెలియని ప్రశ్నలు రావటం వల్ల మార్కులు తగ్గాయి.
ఐఐటీ-జేఈఈకి పోటీపడేవారికి సలహా ఏంటంటే.. తొలుత పరీక్ష అనగానే భయంపోవాలి. ముందుగా తెలిసిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. కష్టమైన ప్రశ్నల కోసం సమయాన్ని వృథాచేయవద్దు.
రోజుకు నాలుగు గంటలు చదివేందుకు సమయం కేటాయిస్తే అందులో రెండు గంటలు కెమిస్ట్రీ, గంట చొప్పున ఫిజిక్‌స, మ్యాథ్‌సకు కేటాయించుకోండి. గంటసేపు ఏకబిగిన చదివితే ఆసక్తి పోయి చికాకు వస్తుంది. పావుగంట, ఇరవై నిమిషాలకు విశ్రాంతి తీసుకోండి. బోర్ అనిపిస్తే సబ్జెక్టు మార్చుకోండి.

Published date : 27 Jun 2013 05:57PM