Jobs: ఊహించని శాలరీలు.. మీ కోసమే.. ఈ సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో !!
రికార్డ్ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు..
ఐటీ కంపెనీలకు వచ్చి పడుతున్న ప్రాజెక్ట్‌లు, ఐటీ కంపెనీల్లో మిడ్, సీనియర్ స్థాయి విభాగాల్లో పెరుగుతున్న అట్రిషన్‌ల కారణంగా టెక్ విభాగంలో రికార్డ్ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వెలుగులోకి వచ్చిన రిపోర్ట్‌లు పేర్కొన్నాయి. కొత్తగా గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన విద్యార్ధులకు..
టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్, హెచ్‌సీఎల్, టెక్ మహీంద్రా, యాక్సెంచర్, క్యాప్‌జెమినితో సహా ఐటి కంపెనీలు 2022 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 2.3 లక్షల మంది కొత్తగా గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన విద్యార్ధులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాయి. ప్రస్తుతం ఈ నియామకం రికార్డ్ స్థాయిలో ఉండగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో టెక్ కంపెనీలు నియామకాల్ని మరింత పెంచేలా ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
రీసెర్చ్ సంస్థ అన్‌ఎర్త్ ఇన్‌సైట్ ఇటీవలి నివేదికలో 2022 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఐటీ కంపెనీలు ఫ్రెషర్ల నియామకాలు 3.5 నుంచి 3.6 లక్షలకు పెంచనున్నాయి.