Skip to main content

Police Jobs: దేశంలో భ‌ర్తీ చేయాల్సిన‌ పోలీసు ఉద్యోగాలు ఇవే.. మొత్తం ఖాళీలు ఎన్ని ఉన్నాయంటే..?

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పోలీసు బలగాలు కొన్నేళ్లుగా గణనీయ అభివృద్ధి సాధించినా.. ఇప్పటికీ అనేక లోపాలు వెంటాడుతున్నాయని ‘ది ఇండియన్‌ జస్టిస్‌ నివేదిక (ఐజేఆర్‌)’ నివేదిక పేర్కొంది.
police jobs recruitment 2022
police jobs recruitment

‘డేటా ఆన్‌ పోలీస్‌ ఆర్గనైజేషన్స్‌ రిపోర్ట్‌–2021’ పేరుతో జూలై 7వ తేదీన (గురువారం) దీనిని విడుదల చేశారు.

తెలంగాణ పోలీసు ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి 

మొత్తం 20.7 లక్షల పోలీసు ఉద్యోగాలు ఉండగా..
దేశ వ్యాప్తంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పోలీసు బలగాల్లో సిబ్బంది సంఖ్య 2010–2020 మధ్య 32% పెరిగిందని.. అయితే మహిళా సిబ్బంది, అధికారుల సంఖ్య మాత్రం 10.5 శాతమే పెరిగిందని నివేదిక స్పష్టం చేసింది. పోలీసు ఉద్యోగాల్లో మహిళలకు 33% ఇవ్వాలన్న లక్ష్యానికి ఇది ఆమడ దూరంలో ఉన్నట్టేనని పేర్కొంది. గత ఏడాది జనవరి నాటికి దేశవ్యాప్తంగా మొత్తం 20.7 లక్షల పోలీసు ఉద్యోగాలు ఉండగా.. అందులో 5.62 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తేల్చింది.

Police Exam Tips: మూడు టెక్నిక్‌లు పాటిస్తే .. పోలీసు ఉద్యోగం మీదే..!

నివేదికలోని కీలక అంశాలు ఇవే..
☛ అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం.. ప్రతి 300 మంది ప్రజలకు ఒక సివిల్‌ పోలీసు ఉండాలి. కానీ ప్రస్తుతం దేశంలో ప్రతి 841 మందికి ఒక సివిల్‌ పోలీసు మాత్రమే ఉన్నారు.
☛ ప్రభుత్వాలు పోలీసు విభాగాల కోసం చేసే ఖర్చులో కేవలం 1.2 శాతమే వారి శిక్షణకు కేటాయిస్తున్నాయి.
☛ బాధితులుగా మారి, సహాయార్థం పోలీస్‌స్టేషన్లకు వచ్చే మహిళలకు సహాయ సహకారాలు అందించడానికి ఉద్దేశించిన విమెన్‌ హెల్ప్‌డెస్క్‌లు ఇంకా పూర్తి స్థాయిలో కార్యరూపంలోకి రాలేదు. దేశంలోని 59 శాతం పోలీసుస్టేషన్లలో మాత్రమే అవి అందుబాటులోకి వచ్చాయి. మిగతా ఠాణాల్లో ఇప్పటికీ బాధిత మహిళలకు పూర్తి భరోసా లభించని పరిస్థితి నెలకొంది. దేశంలో మొత్తంగా 17,233 పోలీస్‌స్టేషన్లు ఉండగా.. అందులో 10,165 ఠాణాల్లో మాత్రమే విమెన్‌ హెల్ప్‌ డెస్క్‌లు ఉన్నాయి.
☛ మొత్తంగా పోలీసు ఉద్యోగాల్లో షెడ్యూల్డ్‌ కులాలవారు 2010లో 12.6% ఉండగా.. 2020 నాటికి ఇది 15.2 శాతానికి చేరింది. అయితే షెడ్యూల్డ్‌ తెగలవారి శాతం మాత్రం 10.6 శాతం నుంచి 11.7 శాతానికి మాత్రమే చేరింది. ఓబీసీల సంఖ్య మాత్రం గణనీయంగా పెరిగి 20.8% నుంచి 28.8 శాతానికి పెరిగింది.
☛ 2010–20 మధ్య మొత్తంగా పోలీసు బలగాల సంఖ్య 32 శాతం పెరిగి.. 15.6 లక్షల నుంచి 20.7 లక్షలకు చేరింది. కానీ మంజూరు చేసిన పోస్టుల్లో ఇప్పటికీ 5.62 లక్షల ఉద్యోగాలు ఖాళీగానే ఉన్నాయి. రాష్ట్రాల వారీగా చూస్తే.. బిహార్‌లో అత్యధికంగా 41.8 శాతం, ఉత్తరాఖండ్‌లో అత్యల్పంగా 6.8 శాతం ఖాళీలు ఉన్నాయి.
☛ కానిస్టేబుల్‌ స్థాయి పోస్టుల్లో ఖాళీలు 2019లో 18 శాతం ఉండగా.. తర్వాతి ఏడాదికి ఖాళీలు 20 శాతానికి పెరిగాయి. అధికారుల పోస్టులను చూస్తే.. ఖాళీలు 29 శాతం నుంచి 32 శాతానికి పెరిగాయి. కేవలం తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో మాత్రమే ఇటీవల పోలీసు ఉద్యోగ ఖాళీల సంఖ్య తగ్గింది.
☛ ప్రతి పోలీసుస్టేషన్‌లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా పెట్టాలని సుప్రీంకోర్టు 2020 డిసెంబర్‌లో ఆదేశాలు జారీ చేసింది. అయినా ఇప్పటికీ మూడింట రెండొంతుల ఠాణాల్లోనే ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా 17,233 పోలీసుస్టేషన్లలో ఇప్పటివరకు 11,837 ఠాణాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. తెలంగాణ, ఒడిశా, పుదుచ్చేరిలలో మాత్రం ప్రతి ఠాణాలో కనీసం ఒక సీసీ కెమెరా ఉన్నాయి. రాజస్తాన్‌లోని మొత్తం 894 పోలీసుస్టేషన్లలో కేవలం ఒక్కచోట మాత్రమే సీసీ కెమెరాలు ఉండగా.. మణిపూర్, లడఖ్, లక్ష ద్వీప్‌ల్లో ఒక్క ఠాణాలోనూ సీసీ కెమెరాలు లేవు.
☛ పెరిగిపోతున్న సైబర్‌ నేరాలకు అడ్డుకట్ట వేయడానికి, బాధితులకు న్యాయం చేయడానికి ప్రతి జిల్లాకు ఓ సైబర్‌ సెల్‌ ఉండాలని 
నాలుగేళ్ల క్రితం పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ సిఫార్సు చేసింది. కానీ దేశంలోని 746 జిల్లాలకుగాను.. 466 జిల్లాల్లో మాత్రమే సైబర్‌ సెల్స్‌ ఉన్నాయి. 14 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రతి జిల్లాలో సైబర్‌ సెల్‌ ఉండగా.. పంజాబ్, మిజోరం, జమ్మూకశ్మీర్‌లలో ఒక్క జిల్లాలోనూ లేవు.

TS Police Exams Best Preparation Tips: పక్కా వ్యూహంతో.. ఇలా చ‌దివితే పోలీస్ ఉద్యోగం మీదే..!

అస‌లు ఐజేఆర్ ఏమిటీ ?
న్యాయవ్యవస్థలో సంస్కరణల కోసం కృషి చేస్తున్న వివిధ సంస్థలు ఉమ్మడిగా రూపొంది స్తున్న నివేదికే ‘ది ఇండియా జస్టిస్‌ రిపోర్టు’. సెంటర్‌ ఫర్‌ సోషల్‌ జస్టిస్, కామన్‌ కాజ్, కామ న్వెల్త్‌ హ్యూమన్‌ రైట్స్‌ ఇనిషియేటివ్, టిస్‌– ప్రయాస్, విధిసెంటర్‌ ఫర్‌ లీగల్‌ పాలసీ, హౌ ఇండియా లీవ్స్‌ సంస్థలు ఇందులో ఉన్నాయి. ఎన్‌సీఆర్‌బీ, బీపీఆర్‌ అండ్‌ డీ కేంద్ర సంస్థల నివేదికలు, గణాంకాల ఆధారంగా 2019నుంచి ఐజేఆర్‌ను రూపొందిస్తున్నారు. 

Groups & SI Jobs: గ్రూప్స్, ఎస్‌ఐ వంటి పోటీ తీవ్రంగా ఉండే పరీక్షల్లో విజయం సాధించాలంటే ఎలా చ‌ద‌వాలి..?

తెలంగాణ‌, ఏపీలో మాత్రం..
తెలంగాణలో మొత్తం పోలీసు సిబ్బందిలో మహిళలు 8%కాగా.. సిబ్బంది, అధికారుల హోదా రెండింటిలోనూ 8 శాతమే ఉన్నారు.. ఏపీలో మొత్తం పోలీసు సిబ్బందిలో మహిళలు 6.3%ఉన్నారు. అధికారి స్థాయిలోని పోస్టుల్లో 5.4% ఉన్నారు.

పోటీ ప‌రీక్ష‌ల బిట్‌బ్యాంక్ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి

Published date : 08 Jul 2022 01:24PM

Photo Stories