Job Opportunities: డిగ్రీ చదివారా.. అయితే ఈ ఉద్యోగాల సమాచారం మీకోసమే..
ఈ కార్యక్రమం హుకుంపేటలోని మహిళా మండల సమాఖ్య భవనంలో జరుగుతుందని డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీరమణి అన్నారు. రాజమహేంద్రవరంలో ఎంసీవీ మోటో క్రోఫ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్, సీనియర్, బ్రాంచ్, ఏరియా మేనేజర్లుగా పనిచేయడానికి ఎంబీఏ లేదా డిగ్రీ చదివిన పురుషులు అర్హులన్నారు. జూనియర్ అక్కౌంటెంట్, ఆడిట్ అక్కౌంటెంట్ ఉద్యోగానికి ఏదైనా డిగ్రీ చదివిన స్త్రీ, పురుషులు కావాలన్నారు.
ఏదైనా బీటెక్ చదివిన..
సీనియర్ అక్కౌంటెంట్ ఇన్ టాక్సేషన్ ఉద్యోగానికి ఏదైనా డిగ్రీ చదివిన పురుషులు, స్త్రీలు అర్హులన్నారు. వివిధ బ్రాంచ్‌ల్లో సేల్స్ ఎగ్జిక్యూటివ్, స్పేర్ ఎగ్జిక్యూటివ్‌లు, బిల్లింగ్ చేయడానికి ఏదైనా డిగ్రీ చదివిన పురుషులకు అవకాశం ఉందన్నారు. రాజానగరం, కడియం, రంపచోడవరం, కోరుకొండలలో రిస్పెప్షనిస్ట్‌గా పనిచేయడానికి పురుషులు, స్త్రీలు కావాలని ఆమె అన్నారు. ఫ్లోర్ సూపర్‌వైజర్, సీనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, టీమ్ లీడర్లు, టెక్నీషియన్లు, వర్క్ ఇన్‌చార్జ్, సీనియర్ అడ్వయిజర్, సర్వీస్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేయడానికి ఏదైనా డిగ్రీ చదివిన పురుషులు అర్హులన్నారు. రాజమహేంద్రవరం నవత రోడ్ ట్రాన్స్‌పోర్ట్‌లో పనిచేయడానికి ఏదైనా డిగ్రీ చదివిన పురుషులు కావాలన్నారు. తడ శ్రీసిటీలో భరత్ ఎఫ్‌ఐహెచ్ లిమిటెడ్‌లో మొబైల్ అసెంబ్లర్‌కు పదో తరగతి ఆపై, ఏదైనా బీటెక్ చదివిన స్త్రీలు కావాలన్నారు. అభ్యర్థులు ఆ రోజు ఉదయం 10 గంటలకు తమ బయోడేటా, రేషన్‌కార్డు, విద్యార్హత సర్టిఫికెట్ నకళ్లతో ఇంటర్వ్యూకు హాజరు కావాలన్నారు. వివరాలకు 90309 24569, 8919868419 ఫోన్ నంబర్లలో సంప్రదించాలన్నారు.