Skip to main content

Breaking New : నిరుద్యోగులంతా నేడు ఉదయం 10 గంటలకు టీవీలు చూడండి.. భారీగా ఉద్యోగాల భర్తీ ప్రకటన చేసే అవ‌కాశం.. ?

అసెంబ్లీలో రేపు(బుధవారం) తాను ఓ కీలక ప్రకటన చేయబోతున్నానని.. నిరుద్యోగులంతా రేపు ఉదయం 10 గంటలకు టీవీలు చూడాలంటూ సీఎం కేసీఆర్‌ చెప్పడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
cm kcr announcement unemployment news
Telangana CM KCR

రేపు ఆయన అసెంబ్లీలో బడ్జెట్‌పై మాట్లాడనున్న సందర్భంగా నిరుద్యోగులకు సంబంధించి కొన్ని కీలక ప్రకటనలు చేసే అవకాశముంది. భారీగా ఉద్యోగాల నోటిఫికేషన్లు ప్రకటించబోతున్నారా? నిరుద్యోగ భృతి ప్రకటిస్తారా?. కేసీఆర్‌ మనసులో ఏముంది? ఆయన ఏం ప్రకటన చేయబోతున్నారనే దానిపై నిరుద్యోగులతో పాటు తెలంగాణ ప్రజలంతా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఏవిధంగా తెలంగాణ ఆవిష్కారమైందో కూడా రేపు అసెంబ్లీలో చెప్పబోతున్నట్లు నేడు వనపర్తిలో జరిగిన బహిరంగసభలో కేసీఆర్‌ పేరొన్న సంగతి తెలిసిందే.

ప్రభుత్వ శాఖలో దాదాపు 90 వేల ఖాళీలు..
భారీ ఉద్యోగాల భర్తీపై రేపు అసెంబ్లీలో ప్రకటన చేయనున్నట్లు సమాచారం. గత ప్రభుత్వాలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాయో గణాంకాలతో సహా కేసీఆర్‌ వివరించనున్నట్లు తెలిసింది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదన్న అసంతృప్తి ఉంది. నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడంలేదనే అపవాది ఉంది. ప్రభుత్వ శాఖలో దాదాపు 90 వేల ఖాళీలు ఉన్నాయని.. వాటిని భర్తీ చేయడంలేదని ప్రభుత్వంపై  ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. దీనికి సమాధానంగా భారీ సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేసే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖలలో కలిపి 70 వేల పైగా ఖాళీలు ఉన్నాయి. పోలీస్, హెల్త్ శాఖలు, మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్, ఆర్అండ్‌బీ శాఖలలో ఉద్యోగాలు ఉన్నాయి.

టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న..
తెలంగాణ‌లో కొత్త జిల్లాల్లో ఉద్యోగుల కేటాయింపు దాదాపు పూరైంది. ఇక రాష్ట్రంలో భారీగా ప్ర‌భుత్వ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేసేందుకు ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది. ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న నిరుద్యోగుల‌కు ప్ర‌భుత్వం శుభ‌వార్త‌ను త్వ‌ర‌లోనే చెప్ప‌నుంది. ఈ మేర‌కు భారీ ఉద్యోగ ప్రకటన చేసేందుకు కసరత్తు చేస్తోంది. 

Telangana: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వ‌ర‌లోనే గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లు..!

తొలి నోటిఫికేషన్‌ను..
ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల కేటాయింపులు, పోస్టింగ్‌లు పూర్తి కావడంతో తెలంగాణ ప్రభుత్వం త్వరలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టనుంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఈ నిర్ణయం తీసుకుని తొలి నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. ఫేజ్ 1లో భర్తీ చేయనున్న ఖాళీల సంఖ్యను ఖరారు చేసేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వివిధ శాఖల కార్యదర్శులతో సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి యోచిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

తెలంగాణ డీఎస్సీ/టెట్‌ స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

70 వేల వరకు పోస్టులు భర్తీ చేయాలని..
అయితే ఇప్పటికే ప్రభుత్వ అధికారులు ప్రణాళిక‌లు కూడా రెడీ చేసినట్లుగా తెలుస్తోంది. ఇటీవ‌ల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి సోమేశ్ కుమార్.. అన్ని శాఖ‌ల్లో ఉన్న ఖాళీల వివరాలన తెప్పించుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం 70 వేల వరకు పోస్టులు భర్తీ చేయాలని భావిస్తోంది. 

17 వేలు పోలీసు ఉద్యోగాలు..
పోలీసు ఉద్యోగాలు 17 వేలు ఉన్నట్లుగా తెలుస్తోంది. వీటితోపాటు టీఎస్‌పీఎస్ నుంచి గ్రూప్-2, గ్రూప్ 3 నోటిఫికేషన్లు విడుదల చేయాని అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నెలలోనే ఉద్యోగ ప్రకటనలు విడుదలయ్యే అవకాశం ఉందని తెలిపారు.

తెలంగాణ పోలీసు ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

​​​​​​​CM KCR: 80 వేల ప్ర‌భుత్వ ఉద్యోగాల భర్తీకి కీల‌క ప్ర‌క‌ట‌న‌..భ‌ర్తీ ప్ర‌క్రియ ఎప్పుడంటే..?

Published date : 09 Mar 2022 08:52AM

Photo Stories