Child Care Leave Increase : 730 రోజుల చైల్డ్ కేర్ సెలవులు.. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును ..?
లోక్‌సభలో ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలుకు కేంద్రం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచడం గానీ, తగ్గించడం గానీ ఉండదు' అని కేంద్ర సిబ్బంది వ్వవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.
అయితే.. లోక్‌సభలో నేడు ఉద్యోగులకు గరిష్ఠంగా 30 ఏళ్ల సర్వీసు కాలం పూర్తి చేసి రిటైర్మెంట్ ఇచ్చే ప్రతిపాదన ఉందా? అని కేంద్రాన్ని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. దీనిపై కేంద్రం సమాధానం ఇచ్చింది. గత మూడేళ్లలో 122 మంది ఉద్యోగులు నిర్బంధ పదవీవిరమణ చేశారని లోక్‌సభ సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్రం ఈ మేరకు సమాధానం ఇచ్చింది. యంత్రాంగాన్ని బలోపేతం చేసే దిశగా డిజిటలైజేషన్, ఎలక్ట్రానిక్ వినియోగం, రూల్స్‌ను సరళించడం వంటి మార్పులు చేసినట్లు పేర్కొంది.
☛ SI Success Story : ఓ రైతుబిడ్డ.. ప్రభుత్వ పాఠశాలలో చదివి.. ఎస్‌ఐ ఉద్యోగం కొట్టాడిలా.. కానీ..
730 రోజుల చైల్డ్ కేర్ సెలవులు ఇలా..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో ఒంటరి మహిళలు, ఒంటరి పురుషులు తమ పిల్లల సంరక్షణ కోసం మొత్తం సర్వీసులు గరిష్ఠంగా 730 రోజుల సెలవులు తీసుకోవచ్చని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. పిల్లల్లో మొదటి సంతానం 18 ఏళ్లు వచ్చే వరకు ఈ సెలవులకు అర్హత ఉంటుందని స్పష్టం చేశారు.
☛ Women SI Success Story : ఓ పేదింటి బిడ్డ 'ఎస్ఐ' ఉద్యోగం కొట్టిందిలా.. ఈమె విజయం కోసం..