Skip to main content

SI Success Story : ఓ రైతుబిడ్డ.. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో చ‌దివి.. ఎస్‌ఐ ఉద్యోగం కొట్టాడిలా.. కానీ..

సాధించాల‌నే పట్టుదల, కృషి ఉంటే దేన్నైనా సాధించవచ్చని నిరూపించాడు ఓ రైతుబిడ్డ. ఎస్‌ఐ పరీక్షా ఫలితాల్లో ప్రతిభ చాటి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. తెలంగాణ పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా వివిధ విభాగాల్లో ఎస్సై, ఏఎస్సై పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి ఆగస్టు 6వ తేదీన (ఆదివారం) విడుదల చేసిన విష‌యం తెల్సిందే.
TS SI Venu Gopal Success Story in Telugu
Venu Gopal Success Story

ఈ ఫ‌లితాల్లో చాలా మంది పేదింటి అణిముత్యాలు విజ‌యం సాధించి.. వాళ్ల త‌ల్లిదండ్రులల్లో ఆనందాన్ని నింపారు. ఈ ఫ‌లితాల్లో చాలా మంది పేదింటి బిడ్డ‌ల్లో.. ఒక‌రు నాయకి వేణుగోపాల్‌.. మట్టిలో మాాణిక్యాలులా మెరిసి ఎస్ఐ ఉద్యోగం కొట్టి త‌మ స‌త్తాచాటారు. ఈ నేప‌థ్యంలో నాయకి వేణుగోపాల్ స‌క్సెస్ స్టోరీ మీకోసం..

కుటుంబ నేప‌థ్యం :
కృషి, పట్టుదల ఉంటే దేన్నైనా సాధించవచ్చని నిరూపించాడు ఓ రైతుబిడ్డ. ఎస్‌ఐ పరీక్షా ఫలితాల్లో ప్రతిభ చాటి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ఆగ‌స్టు 6వ తేదీన‌(ఆదివారం) విడుదలైన ఎస్‌ఐ పరీక్షా ఫలితాల్లో ఉండవెల్లికి చెందిన నాయకి వేణుగోపాల్‌ విజయం సాధించారు. జోగులాంబ జిల్లా ఉండవెల్లికి చెందిన రఘురాములు–మంగమ్మ కుమారుడు వేణుగోపాల్‌.

☛ Women SI Success Story : ఓ పేదింటి బిడ్డ 'ఎస్ఐ' ఉద్యోగం కొట్టిందిలా.. ఈమె విజ‌యం కోసం..

ఎడ్యుకేష‌న్ :
నాయకి వేణుగోపాల్.. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి వరకు చదవుకున్నాడు. కర్నూల్‌లో ఇంటర్‌, హైదరాబాద్‌లో బీటెక్‌ పూర్తి చేశారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో హైదరాబాద్‌లో ఎస్‌ఐ శిక్షణ పొంది పోటీ పరీక్షల్లో రాణించారు. ఎస్‌ఐ పరీక్షల్లో అతడు 262 మార్కులు సాధించాడు. ఈయ‌న స‌క్సెస్ మ‌న అంద‌రికి స్ఫూర్తిదాయ‌కం.

ముఖ్యమైన తేదీలు.. కావాల్సిన పత్రాలు ఇవే..
ఎస్‌ఐ పరీక్షల్లో ఉత్తీర్ణ‌త సాధించి.. శిక్షణకు ఎంపికైన అభ్యర్థులు ఆగస్టు 9 నుంచి 11 వరకు ఆన్‌లైన్‌లో ప్రత్యేక ఫార్మాట్‌లో వారిపై ఉన్న కేసులు, మెడికల్‌ అంశాల వివరాలు అటెస్టేషన్‌ చేయించాలని సూచించారు. అటెస్టేషన్‌ కాపీని ఏ4 సైజులో ప్రింట్‌ తీసి, వాటిపై పాస్‌పోర్ట్‌ సైజు ఫొటోలు అంటించి మూడు కాపీల్లో గెజిటెడ్‌ అధికారితో సంతకాలు చేయించి వాటిని సూచించిన కేంద్రాల్లో ఆగస్టు 14 నాటికి అందజేయాలని పేర్కొన్నారు.

☛➤ టీఎస్ ఎస్సై, ఏఎస్సై పోస్టుల కటాఫ్‌ మార్కుల కోసం క్లిక్ చేయండి

☛➤ టీఎస్‌ ఎస్సై, ఏఎస్సై పోస్టుల‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితా కోసం క్లిక్ చేయండి 

☛➤ టీఎస్‌ ఎస్సై, ఏఎస్సై పోస్టుల‌కు సంబంధించిన పూర్తి వివ‌రాల‌కు క్లిక్ చేయండి

ఎంపిక ప్రక్రియలో సందేహాల నివృత్తికి సైతం నియామక మండలి అవకాశం కల్పించింది. ఆగస్టు 7వ తేదీ నుంచి 9 వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో సందేహాలు నివృత్తికి అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకు ఎస్సీ, ఎస్టీలకు రూ.2వేలు, ఇతరులకు రూ.3వేలు ఆన్‌లైన్‌లో చెల్లించాలని బోర్డు అధికారులు పేర్కొన్నారు.

434 మంది పురుషులు, 153 మంది మహిళల్ని..
ఎంపికైన అభ్యర్థుల జాబితా పోలీస్‌ నియామక మండలి వెబ్‌సైట్‌లో ఆగస్టు 7వ తేదీన (సోమవారం) ఉదయం నుంచి అందుబాటులో ఉంచింది. వివిధ విభాగాలకు చెందిన 587 ఉద్యోగాలకు 434 మంది పురుషులు, 153 మంది మహిళల్ని ఎంపికయ్య‌రు. ఆగస్టు 7వ తేదీన‌ ఎస్సై, ఏఎస్సై పోస్టుల కటాఫ్‌ మార్కుల కేటాయింపు, అభ్యర్థుల జన్మతేదీ వంటి వివరాలు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

☛ Inspirational Success Story : ఒక వైపు తండ్రి మ‌ర‌ణం.. మ‌రో వైపు కుటుంబంపై నింద‌లు.. ఈ క‌సితోనే చ‌దివి డీఎస్పీ ఉద్యోగం కొట్టానిలా..

Published date : 08 Aug 2023 11:15AM

Photo Stories