Jobs: ఇంటర్ అర్హతతో ఉద్యోగవకాశాలు.. పూర్తి వివరాలు ఇలా
Sakshi Education
కాకినాడ సిటీ(తూర్పుగోదావరి): జిల్లా వినియోగదారుల కమిషన్‌లో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్స్, టైపిస్ట్ పోస్టులకు ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన నియామకాలు చేపట్టనున్నట్లు కమిషన్ అధ్యక్షుడు చెరుకూరి రఘుపతి వసంతకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 18,500 రెమ్యూనరేషన్ ఉంటుందన్నారు.
దరఖాస్తు చివరి తేదీ..
జూనియర్ స్టెనోగ్రాఫర్స్‌కి ఇంటర్మీడియెట్, స్టెనోగ్రాఫీ లోయర్, టైపు హయ్యర్ ఉత్తీర్ణులై ఉండాలన్నారు. టైపిస్ట్ పోస్టుకి ఇంటర్మీడియట్, టైపు హయ్యర్ ఉత్తీర్ణులై ఉండాలన్నారు. జూనియర్ అసిస్టెంట్ పోస్టుకి ఇంటర్మీడియెట్, టైపు, హయ్యర్ ఉత్తీర్ణులై ఉండాలన్నారు. 18 నుంచి 42 ఏళ్ల వయసు మించరాదన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు వయసు సడలింపు వర్తిస్తుందన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తులు మార్చి 3వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు అధ్యక్షుడు, జిల్లా వినియోగదారుల కమిషన్, కోర్టు కాంపౌండ్, కాకినాడలో అందజేయాలన్నారు.
Published date : 22 Feb 2022 07:17PM