Amazon : అమెజాన్‌లో వేలమంది ఉద్యోగులపై వేటు.. కారణం ఇదే..!
ఈ క్రమంలో ముందుగా ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. ఈ కోవలో మెటా, ట్విటర్, మైక్రోసాఫ్ట్ ముందు వరుసలో ఉండగా, తాజాగా మరో ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ వచ్చి చేరింది.
గతవారం హైరింగ్ ప్రక్రియకు బ్రేక్ వేయనున్నట్టు అంతర్గత మెమోలో ప్రకటించిన అమెజాన్ ఇపుడిక ఉద్యోగులను తొలగించడం ప్రారంభించింది. తనను ఉద్యోగం నుంచి తొలగించినట్టు అమెజాన్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ జామీ జాంగ్ లింక్డ్‌ఇన్‌లో పోస్ట్ చేయడంతో కలకలం రేగింది. ఎక్కువ వేతనం అందుకుంటున్న ఉద్యోగులు ఆందోళనలో పడిపోయారు. అంతేకాదు, రోబోటిక్స్ టీమ్ మొత్తానికి పింక్ స్లిప్‌లు అందించారిన మాజీ ఉద్యోగి పోస్ట్‌లో పేర్కొనడం మరింత ఆందోళనకు దారి తీసింది.
లింక్డ్‌ఇన్ డేటా ప్రకారం, కంపెనీ రోబోటిక్స్ విభాగంలో కనీసం 3,766 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో ఎంతమందిని తొలగించారు అనేది స్పష్టత లేదు. దీనిపై అమెజాన్‌అధికారికంగా స్పందించాల్సి ఉంది.
మరోవైపు వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకారం, కంపెనీ తన లాభదాయకంగా యూనిట్ల సిబ్బందిని వేరే ఉద్యోగాలు చూసుకోమని ఇప్పటికే ఆదేశించింది. సంబంధిత ప్రాజెక్ట్‌లను త్వరలోనే నిలిపివేయనుందట. అసాధారణమైన ఆర్థిక కారణాల రీత్యా రాబోయే కొన్ని నెలలపాటు కొత్త ఇంక్రిమెంటల్ హైర్‌లను పాజ్ చేయాలని నిర్ణయించినట్టు పీపుల్ ఎక్స్‌పీరియన్స్ అండ్ టెక్నాలజీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బెత్ గలెట్టీ గతవారం జారీ చేసిన ఇంటర్నల్ మెమోలో తెలిపారు. పెట్టుబడులు, నియామకాలను బాలెన్స్ చేయాలని భావిస్తున్నాం.. అయినా ఆర్థిక సవాళ్లు ఇదే తొలిసారి కాదు.. గతంలో కూడా ఎదుర్కొన్నాం. అయితే 'టార్గెటెడ్ ప్రాజెక్ట్‌ల' కోసం కొత్త ఉద్యోగులను నియమించుకోవడంతో పాటు ఇష్టపూర్వకంగా కంపెనీని విడిచిపెట్టిన ఉద్యోగులను కూడా భర్తీ చేస్తామని పేర్కొనడం గమనార్హం.