Skip to main content

Air India Recruitment: ఎయిర్‌ ఇండియా భారీ నియామకాలు.. 15 వారాల పాటు శిక్షణ

విమానయాన రంగ సంస్థ ఎయిర్‌ ఇండియా కొత్తగా 5,100 మందిని నియమించుకోనున్నట్లు ప్రకటించింది.
Air India Recruitment

వీరిలో 900 మంది పైలట్లతోసహా 4,200 మంది విమాన సిబ్బందిని (క్యాబిన్‌ క్రూ) చేర్చుకోనున్నట్టు వెల్లడించింది. బోయింగ్, ఎయిర్‌బస్‌ నుంచి 470 విమానాలను ఎయిర్‌ ఇండియా సమకూర్చుకుంటున్న సంగతి తెలిసిందే. దేశీయంగా, అంతర్జాతీయంగా వేగంగా విస్తరిస్తున్నందున కొత్త నియామకాలు చేపట్టినట్టు ఎయిర్‌ ఇండియా తెలిపింది. 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి మధ్య 1,900 మందికి పైగా విమాన సిబ్బందిని కంపెనీ చేర్చుకుంది. అభ్యర్థులకు ముంబైలోని ఎయిర్‌ ఇండియా ట్రెయినింగ్‌ సెంటర్‌లో 15 వారాల పాటు తరగతి గది, ఇన్‌ఫ్లైట్‌ శిక్షణ ఇస్తారు. 

 

Published date : 25 Feb 2023 01:54PM

Photo Stories