YouTuber AparnaTandale: ట్రెండింగ్ పర్సన్... టాప్ 10లో స్థానం.. చీపురుతో జర్నీ స్టార్ట్... ఆమె ఎవరో తెలుసా.?
కానీ, ఇప్పుడు సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ఏ చిన్న టాలెంట్ ఉన్నా చేతిలో ఉన్న మొబైల్‌లో దాన్ని షూట్ చేసి.. ఆన్‌లైన్‌లో పెట్టేస్తున్నారు... ప్రజలకు నచ్చితే ఓవర్ నైట్‌లోనే స్టార్‌డం సంపాదిస్తున్నారు. అలాంటి ఓ 22 ఏళ్ల అమ్మాయి గురించి తెలుసుకుందాం పదండి....
చదవండి: పదో తరగతికే పెళ్లి... మూడేళ్లకే భర్త మృతి... కట్ చేస్తే ఇప్పుడామె‘ఆదర్శం’
టాప్ టెన్‌లో ఒకరిగా....
గతేడాది టాప్ 10 కంటెంట్ క్రియేటర్స్‌గా యూ ట్యూబ్ ప్రకటించిన వారిలో 22 ఏళ్ల అపర్ణా టాండలే ఉంది. మన దేశంలో ఇంటింటా తెలిసిన పని మనిషి పాత్రను చీపురు పట్టి హాస్యం చిలికేలా పోషించడమే అపర్ణా సక్సెస్‌కు కారణం. ఆమె చేసే ‘కామ్‌వాలీ బాయి’ వీడియోలకు 37 లక్షల మంది సబ్‌స్క్రయిబర్లు ఉన్నారు. ఆమె తీసిన బారిష్ మే భీగ్‌నా షార్ట్ వీడియోతో ప్రపంచాన్ని తనవైపు తిప్పుకుంది. ఓ చిన్న వీడియోకి మూడు కోట్ల వ్యూస్ వచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు ఆ అమ్మాయి టాలెంట్.
చదవండి: పేపర్ బాయ్ నుంచి ఐఏఎస్ వరకు... రాజ్‌పుత్ జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమే
పూణె స్వస్థలం...
పూణెకు చెందిన 22 ఏళ్ల అపర్ణ టాండాలె 2022లో యూట్యూబ్‌లో ఒక టాప్ కంటెంట్ క్రియేటర్‌గా నిలిచింది. ఆమె షార్ట్ వీడియోస్ కోసం చేసే పాత్ర పేరు షీలా దీదీ. సిరీస్ పేరు ‘కామ్‌వాలీ బాయి’. కామ్‌వాలీ అంటే పని మనిషి. పనిమనిషి లేని మధ్యతరగతి ఇల్లు ఉండదు. పని మనిషితో పేచీ పడని ఇల్లాలూ ఉండదు. పని సరిగ్గా చేయడం లేదని అమ్మగారు సణిగితే, పని ఎక్కువైందని పనిమనిషి గొణుగుతుంది.
యూనివర్సిటీ డ్రాపౌట్... పగ్గాలు చేపట్టి 20 ఏళ్లు... ముకేశ్ అంబానీ జీవిత విశేషాలు తెలుసా
స్మార్ట్ పనిమనిషి పాత్ర
బాగా తెలివైన పని మనిషైతే ‘స్మార్ట్ వర్క్’ చేసి పనిని తగ్గించుకోవడమో, తప్పించుకోవడమో చేస్తుంది. అపర్ణా టాండాలె తన సిరీస్‌లో ధరిస్తున్నది ఈ స్మార్ట్ పనిమనిషి పాత్రనే. ఎప్పుడూ ఆకుపచ్చని చీర, మేచింగ్ బ్లౌజ్, కొప్పు వేసిన జుట్టు, మెడలో నల్ల పూసలు, చేతిలో చీపురు... ఇది పనిమనిషి షీలా ఆహార్యం. ఆమె పని చేసేది ఒక యువ జంట ఇంట్లో. చేయాల్సిన పని చేస్తుంటుంది గాని ఒక్కోసారి తేడా వచ్చిందంటే ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంటుంది.
చదవండి: అవమానాలు భరించలేక కిటికిలోంచి దూకేద్దాం అనుకున్నా...
చేతినిండా యూ ట్యూబ్ చానెల్స్....
పూణెకు చెందిన యూ ట్యూబర్ అపర్ణ టాండాలెకు ‘షార్ట్స్ బ్రేక్’ అనే యూట్యూబ్ చానల్ ఉంది. అందులో ‘కామ్ వాలీ బాయి’ సిరీస్ చేస్తుంది. ఈ ఒక్క యూ ట్యూబ్ చానల్ కాకుండా ‘టేక్ ఏ బ్రేక్’, ‘మ్యాడ్ ఫర్ ఫన్ ’ అనే ఇంకో రెండు మూడు చానల్స్ నడుపుతోంది అపర్ణ.
చదవండి: ఎనిమిదో తరగతికే పెళ్లి... ఇప్పుడు ఆ యువతి ఏం సాధించిందో తెలుసా....
మధ్యతరగతి కుటుంబం
మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన అపర్ణకు బాల్యం నుంచి నటి కావాలనే కోరిక. స్కూల్, కాలేజీలో స్టేజ్ మీద నాటకాలు వేసేది. 2018 నుంచి యూ ట్యూబ్‌లో షార్ట్ వీడియోలు మొదలెట్టింది. పలుచటి శరీరంతో చురుగ్గా కదులుతూ హుషారైన ముఖ కవళికలతో ఆకట్టుకుంటుంది అపర్ణ.
‘ప్రతి ఇంట్లో ఇంటి పని ఉంటుంది. అలాగే పని మనిషి కూడా కావాల్సిందే. ఆ పాత్రను తీసుకుంటే ఎంతో హాస్యం పండించవచ్చు. బాధగా ఉన్నవారు కూడా నా వీడియోలు చూసి నవ్వాలి’ అంటుంది అపర్ణ. అలా నవ్వుతున్నారు కనుకనే ఆమెకు పాపులారిటీ. సృజనాత్మక ఐడియాలు ఉంటే భారీగా పాపులర్ కావచ్చనేదానికి అపర్ణే ఒక పెద్ద చీపురంత ఉదాహరణ.