Skip to main content

Inspirational Success Story : మాది మారుమూల గ్రామం..డ‌బ్బు కోసం రెస్టారెంట్‌లో ప‌నిచేశా.. నేడు లక్షల కోట్ల కంపెనీకి సీఈవోగా ప‌నిచేస్తున్నా.. నా స‌క్సెస్ సీక్రెట్ ఇదే..

సాధించాల‌నే ప‌ట్టుద‌ల‌.. క‌సి ఉంటే.. ఎంపిక చేసుకున్న రంగంలో అద్భుతమైన విజ‌యాలు సాధించ‌గ‌ల‌రు. స‌రిగ్గా ఇదే కోవ‌కు చెందిన వారు యామిని రంగన్. పట్టుదలకు మారు పేరు ఈమె.
yamini rangan ceo hubspot success story in telugu

విజయానికి కేరాఫ్ అడ్రస్‌ భారత సంతతికి చెందిన యామిని రంగన్. రెస్టారెంట్‌లో సర్వర్‌గా కరియర్‌ను ప్రారంభించిన యామిని ఈరోజు రూ.2.11లక్షల కోట్లకు పైగా విలువైన కంపెనీగా సీఈవోగా సేవలందిస్తున్నారు.

☛ Businessmans First Job and Salary : బిజినెస్.. మెగాస్టార్ల‌ తొలి ఉద్యోగం.. తొలి జీతం ఎంతంటే..?

ఈఏడాది టాప్‌ 100 టెక్‌ మహిళల్లో చోటు సంపాదించుకున్నారు. యామిని రంగన్ యుఎస్‌లోని అతి పిన్నవయస్కురాలైన అత్యుత్తమ వ్యాపార కార్య నిర్వాహకులలో ఒకరు. ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చాలనే లక్ష్యంతో తక్కువ కాలంలోనే ఆమె ఎన్నో పేరు ప్రఖ్యాతులు, సంపదను కూడబెట్టుకున్నారు. ఈ నేప‌థ్యంలో యామిని సక్సెస్ జ‌ర్నీ..

కుగ్రామం నుంచి వచ్చి.. పిన్న వయసులోనే..

yamini rangan ceo hubspot real life story in telugu

టెక్ ప్రపంచంలో అత్యంత గౌరవనీయమైన సీఈవీల్లో ఒకరుగా ఉన్నారు యామిని. భారతదేశంలోని  కుగ్రామం నుంచి వచ్చి పిన్న వయసులో  గ్లాస్‌ సీలింగ్‌ను  బ్రేక్‌ చేసి తానేంటో నిరూపించుకుంది.  మల్టీ బిలియన్ డాలర్ల టెక్ కంపెనీకి నాయకత్వం వహించే కొద్దిమంది మహిళల్లో ఒకరుగా పేరు తెచ్చుకోవడం విశేషం. హబ్‌స్పాట్‌ కంపెనీలో చేరి రెండేళ్లు పూర్తి కాకముందే  సీఈవోగా బాధ్యతలు చేపట్టిన ఘనత ఆమెది. జనవరి 2020 నుంచి ఆగస్టు 2021 వరకు చీఫ్ కస్టమర్ ఆఫీసర్‌గా, సెప్టెంబర్ 2021 నుంచి ఇప్పటి వరకు సీఈవోగా సేవలందిస్తున్నారు. 25.66 బిలియన్ డాలర్ల మార్కెట్‌ క్యాప్‌తో కంపెనీ దిన దినాభివృద్ది చెందుతోంది. 2023లో యామినీ రంగన్ నికర విలువ దాదాపు 32 మిలియన్‌ డాలర్లు.

☛ Inspirational Success Story : ఊహించని విజ‌యం.. ఆఫీసు బాయ్ నుంచి రెండు కంపెనీలకు సీఈవో స్థాయికి వ‌చ్చానిలా.. కానీ..

21 ఏళ్ల వయస్సులోనే..
21 ఏళ్ల వయస్సులో, చాలా పరిమితమైన నగదుతో  యామిని ఇండియా వదిలి భయం భయంగా అమెరికాకు పయనమైంది. జీవితం అంత సులభం  కాదని ఆమె వెంటనే గ్రహించింది. యూఎస్‌లో జీవించడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో యామిని అద్దె చెల్లించిన తర్వాత ఆమె జేబులో మిగిలింది. కేవలం  150  డాలర్లు మాత్రమే. దీంతో ఉద్యోగం సంపాదించడం ఒక్కటే మార్గమని నిర్ణయించుకుంది.

ఫుట్‌బాల్ స్టేడియం రెస్టారెంట్‌లో ఫుడ్‌, డ్రింక్స్ అందించా..

yamini rangan ceo hubspot inspire story in telugu

అలా అట్లాంటాలోని ఫుట్‌బాల్ స్టేడియం రెస్టారెంట్‌లో ఫుడ్‌, డ్రింక్స్‌ అందించడం తొలి ఉద్యోగమని యామిని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. తానెప్పుడూ స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటాననీ, అందుకే తల్లిదండ్రుల వద్దకు తిరిగి వెళ్లి డబ్బు అడగడానికి ఇష్టపడ లేదని చెప్పారు. యామిని యూఎస్‌లో మాస్టర్స్ చేయడానికి ముందు కోయంబత్తూరులో బీటెక్‌, తరువాత బెర్కిలీ నుంచి ఎంబీఏ పట్టా పుచ్చుకుంది.సుదీర్ఘ కెరీర్‌లో సాప్‌, లూసెంట్, వర్క్‌డే, డ్రాప్‌బాక్స్ లాంటి ఐటీ దిగ్గజ కంపెనీల్లో నిచేశారు. 2019లో శాన్ ఫ్రాన్సిస్కోలో వ్యాపారంలో అత్యంత ప్రభావవంతమైన మహిళగా ప్రశంసలందుకున్నారు. యామిని ఇప్పుడు ఇద్దరు అబ్బాయిలు.

☛ నాడు ఎంద‌రో తిరస్కరించారు.. నేడు రూ.65,000 కోట్ల కంటే ఎక్కువ సంపాదించానిలా.. నా స‌క్సెస్ ప్లాన్ ఇదే..!

Published date : 18 Dec 2023 08:45AM

Photo Stories