Skip to main content

CM KCR: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..త్వరలోనే 60-70 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ..నవంబర్‌ తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్లు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో నిరుద్యోగులకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
Telangana CM KCR
CM KCR

ఉద్యోగాల విషయంలో పారద్శకంగా ఉంటామని, ఇకపై ప్రతి ఏడాది ఉద్యోగ క్యాలెండర్‌ విడుదల చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ న‌వంబ‌ర్ 8వ తేదీన జరిగిన మీడియా సమావేశంలో ప్రకటించారు.  ‘కొత్త జోనల్‌ విధానం ప్రకారం ఉద్యోగులను సర్దుతున్నరు. రెండు మూడు రోజుల్లో నా దగ్గరే ఉద్యోగ సంఘాలతో సమావేశం ఉంది. నవంబర్‌లో ఉద్యోగులను సర్దుబాటు చేసి వెనువెంటనే వచ్చే 60–70 వేల ఖాళీలకు తక్షణమే నోటిఫికేషన్లు ఇస్తం. అవన్నీ నింపేస్తం. ప్రతి ఏటా ఏ ఏ శాఖల్లో ఎన్ని ఉద్యోగాలు వస్తాయో తెలుపుతూ ఉద్యోగ క్యాలెండర్‌ సైతం ప్రకటిస్తాం. దేశంలో ఇలా చేసే తొలి ప్రభుత్వం మాదే. మేము తెచ్చిన స్థానిక రిజర్వేషన్లతో 95 శాతం ఉద్యోగాలు మన పిల్లలకే వస్తయి. గెజిటెడ్‌ పోస్టులు కూడా మనోళ్లకే వచ్చేలా వాటిని జోనల్‌ పోస్టుల్లోనే పెట్టినం. ఇప్పటివరకు 1.35 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. మరో 80 వేల వరకు ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం. రాష్ట్రంలో నిరుద్యోగం తక్కువగా ఉందని పలు సర్వేల్లో వెల్లడైంద‌ని సీఎం కేసీఆర్ చెప్పారు.

టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి


తెలంగాణ పోలీసు ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి


తెలంగాణ డీఎస్సీ/టెట్‌ స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

Published date : 09 Nov 2021 01:48PM

Photo Stories