School Assistants: స్కూల్ అసిస్టెంట్ల పదోన్నతి ఫైనల్ లిస్ట్ సిద్ధం.. 17న ఐటీడీఏలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులోని స్థానిక ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, జీపీఎస్ పాఠశాలల్లో పని చేస్తున్న ఎస్జీటీ, తత్సమాన అర్హత కలిగిన ఉపాధ్యాయులకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించేందుకు ఫైనల్ సీనియర్ లిస్ట్ సిద్ధమైందని, ఆ జాబితాను పాఠశాలల హెచ్‌ఎంలకు పంపించామని గిరిజన సంక్షేమ శాఖ డీడీ కొండలరావు ఫిబ్రవరి 15వ తేదీ ఓ ప్రకటనలో తెలిపారు. పదోన్నతులు పొందేందుకు అర్హత కలిగిన ఉపాధ్యాయుల సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయాల్సి ఉందన్నారు. అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఫిబ్రవరి 17వ తేదీ ఉదయం 10 గంటలకు ఐటీడీఏలోని గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయానికి హాజరు కావాలని సూచించారు.
Tenth Board Exams: మార్చి 18 నుంచి జరిగే బోర్డు పరీక్షలకు ఏర్పాట్లు సిద్ధం..!
Published date : 16 Feb 2024 01:14PM