Good News: ప్రొఫెసర్లకు ఉద్యోగోన్నతి.. అభ్యంతరాలు స్వీకరణకు చివరి తేదీ ఇదే..
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో పనిచేస్తున్న క్లినికల్, డెంటల్ స్పెషాలిటీల్లోని అసిస్టెంట్ ప్రొఫెసర్లకు అసోసియేట్ ప్రొఫెసర్లుగా ఉద్యోగోన్నతి కల్పించడానికి సంబంధించిన ప్రొవిజనల్ సీనియారిటీ జాబితాను జనవరి 20న విడుదల చేశారు.
డీఎంఈ వెబ్‌సైట్‌లో జాబితాను అందుబాటులో ఉంచారు. జనవరి 22 మధ్యాహ్నం 12 గంటలలోపు అభ్యంతరాలను తెలియజేయాలని డీఎం. డాక్టర్ రాఘవేంద్రరావు తెలిపారు. 2021–22 ప్యానల్ సంవత్సరానికి సంబంధించి 31 విభాగాల్లో 441 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను ఉద్యోగోన్నతుల ద్వారా ప్రభుత్వం భర్తీ చేస్తోంది. అదే విధంగా 189 ప్రొఫెసర్ పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేసే ప్రక్రియ కొనసాగుతున్నది.
చదవండి:
Assistant Professors: అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా చేరాలనుకునే అభ్యర్థులకు యూజీసీ తీపి కబురు..
డిసెంబర్ 20న ఏపీ సెట్... అక్టోబర్ 5 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులకు గడువు
IIP Recruitment: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు
Published date : 21 Jan 2022 12:35PM