డిసెంబర్ 20న ఏపీ సెట్... అక్టోబర్ 5 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులకు గడువు
Sakshi Education
ఏయూ క్యాంపస్ (విశాఖ తూర్పు): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష (ఏపీసెట్)ను డిసెంబరు 20వ తేదీన నిర్వహించనున్నట్టు సెట్ మెంబర్ సెక్రటరీ ఆచార్య కె.శ్రీనివాసరావు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
అక్టోబర్ 5వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. రూ.1,000 అపరాధ రుసుముతో అక్టోబర్ 12 వరకు, రూ.2,000 అపరాధ రుసుముతో అక్టోబరు 21 వరకు, రూ 5,000 అపరాధ రుసుముతో నవంబరు 11 వరకు దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. డిసెంబరు 12 నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. పూర్తి సమాచారం ఏపీసెట్ వెబ్‌సైట్ www.apset.net.in నుంచి పొందవచ్చని తెలిపారు.
Published date : 19 Sep 2020 02:22PM