Various Teaching Posts : ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో వివిధ టీచింగ్ పోస్టుల్ని ఉద్యోగోన్నతతో భర్తీ చేయాలి..
గుంటూరు: జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఖాళీగా ఉన్న వివిధ సబ్జెక్టు టీచర్ పోస్టుల్ని ఉద్యోగోన్నతుల ద్వారా భర్తీ చేయాలని ఏపీటీఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.బసవ లింగారావు, మొహమ్మద్ ఖాలీద్ ఆదివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్లస్ టూ పాఠశాలల్లో రెగ్యులర్ ప్రాతిపదికన టీచర్ పోస్టుల్ని మంజూరు చేయాలని కోరారు. డైట్ కళాశాలలో ఖాళీల్ని రెగ్యులర్ ప్రాతిపదికన అర్హత గల ప్రధానోపాధ్యాయులతో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
Gaganyaan: నాసా ప్రయోగానికి ‘గగన్‌యాన్’ వ్యోమగామి.. భారత్-అమెరికా అంతరిక్ష సహకారం
ఉమ్మడి గుంటూరు జిల్లాలో వెనుకబడిన పల్నాడు ప్రాంతంలో ఉపాధ్యాయుల కొరతతో బోధన ప్రమాణాలు కుంటుపడి, విద్యార్థులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాచర్ల మండలం విజయపురిసౌత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 424 మంది విద్యార్థులకు 20 పోస్టులు మంజూరు కాగా, తెలుగు, హిందీ, ఇంగ్లిష్, ఫిజికల్ సైన్స్ బోధిస్తున్న నలుగురు టీచర్లు మినహా మిగిలిన 16 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు. వెల్దుర్తి మండలంలో 80 మందికి పైగా ఉపాధ్యాయుల కొరత ఉందని తెలిపారు.
Indian Navy Jobs 2024 : ఇండియన్ నేవీలో 741 పోస్టులు.. అర్హతలు.. దరఖాస్తు వివరాలు ఇవే..
గుంటూరు రూరల్ మండలంలోని ఉన్నత పాఠశాలల్లో పలువురు సీనియర్ ఉపాధ్యాయులు గత జనవరి నుంచి ఉద్యోగ విరమణ చేయడంతో ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. గుంటూరు నగరపాలకసంస్థ పరిధిలోని అన్ని ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత ఉందని పేర్కొన్నారు. సబ్జెక్టు టీచర్ల స్థానంలో ఎస్జీటీలతో తాత్కాలికంగా విద్యాబోధన కొనసాగుతోందని తెలిపారు. ఉపాధ్యాయుల కొరతపై నూతన ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి దృష్టి సారించడంతో పాటు ఉపాధ్యాయ సంఘాలతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని వారు కోరారు.
Paris Olympics: ఒలింపిక్స్‌లో పడి లేచిన తరంగం.. ‘మను’సంతా పతకమే!