Skip to main content

EWS Reservation: ఉద్యోగ నోటిఫికేషన్లలో ఈడబ్ల్యుఎస్‌ వర్గాలకు నష్టం

హన్మకొండ చౌరస్తా: ప్రభుత్వం జారీ చేస్తున్న ఉద్యోగ నోటిఫికేషన్లతో ఈడబ్ల్యూఎస్‌ వర్గాలు నష్టపోయే అవకాశం ఉందని, యువత మరో పదేళ్లు నిరుద్యోగులుగా మిగిలిపోయే కుట్రలు జరుగుతున్నాయని డీసీసీబీ మాజీ చైర్మన్‌ జంగా రాఘవరెడ్డి ఆరోపించారు.
EWS Reservation
ఉద్యోగ నోటిఫికేషన్లలో ఈడబ్ల్యుఎస్‌ వర్గాలకు నష్టం

 హనుమకొండ హంటర్‌రోడ్‌లోని తన కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రకటిస్తున్న ఉద్యోగ నోటిఫికేషన్లకు మధ్య రిజర్వేషన్ల వ్యత్యాసం పాటిస్తున్నదని, ఒక ఉద్యోగ ప్రకటనకు సంబంధించిన నోటిఫికేషన్‌ నిబంధనలు ఇంకొక ఉద్యోగానికి ఎందుకు వర్తించదని ప్రశ్నించారు.

చదవండి: Private Schools: ప్రైవేట్‌ స్కూళ్లపై మోజు వీడండి

గ్రూప్‌–1 నోటిఫికేషన్‌లో పొందుపరిచిన రిజర్వేషన్‌ విధానం ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌ వర్గాలకు గరిష్ట వయోపరిమితి 44, 45 సంవత్సరాలకు కల్పించిన ప్రభుత్వం, టెట్‌కు అదనంగా ఐదేళ్ల వయోపరిమితి ఇవ్వకుండానే ప్రకటన విడుదల చేసిందన్నారు. ఇప్పటికై నా సీఎం కేసీఆర్‌ కళ్లు తెరిచి నిరుద్యోగ యువతను మోసంచేయడం మానేయాలని, ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

చదవండి: పాఠశాలకు ‘డిజిటల్‌ సామగ్రి’ అందజేత

Published date : 05 Aug 2023 04:20PM

Photo Stories