టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయాలి
తెయూ(డిచ్‌పల్లి): టీఎస్పీఎస్సీ బోర్డును ప్రక్షాళన చేయాలని, పేపర్ లీకేజీలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా సమగ్ర విచారణ జరిపించి, నిందితులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. తెయూలో విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించి, అవినీతికి పాల్పడిన అధికారులను తొలగించి, టీఎస్పీఎస్సీ బోర్డును తక్షణమే ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, విద్యార్థి, నిరుద్యోగుల జీవితాలకు భరోసా కల్పించే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీవీఎం రాష్ట్ర కార్యదర్శి జీవీఎం విఠల్, పీవైఎల్ నాయకులు కిషన్, నరేందర్, తెయూ పీడీఎస్‌యూ అధ్యక్షుడు సంతోష్, జిల్లా కార్యదర్శి కర్క గణేష్, ఉపాధ్యక్షుడు అషుర్, ఎంఎస్‌ఎఫ్, ఏఎస్‌ఏ నాయకులు సురేష్, రమణ, చక్రి పాల్గొన్నారు.