Andhra Pradesh : సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన ఐఏఎస్ ప్రొబేషనర్స్.. వీరితో ముఖ్యమంత్రి ఏమన్నారంటే..?
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్ : 2021 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన తొమ్మిది మంది ప్రొబేషనరీ అధికారులు వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులను కలిశారు.
పాలనాపరమైన అవగాహన పెంపొందించుకునేందుకు వారి సూచనలు, సలహాలు తీసుకున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌తో సమావేశమయ్యారు.
ఈ సందర‍్భంగా.. ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ చేసేలా పనిచేస్తూ, సామాన్యుడికి సైతం అందుబాటులో ఉంటూ ముందుకుసాగాలని ఐఏఎస్ ప్రొబేషనర్స్‌కు మార్గనిర‍్దేశం చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. వారికి ఆల్ ద వెరీ బెస్ట్ చెప్పారు.
Success Story: ఎలాంటి కోచించి లేకుండానే.. సివిల్స్‌లో 74వ ర్యాంక్ కొట్టానిలా..
ముఖ్యమంత్రిని కలిసిన ఐఏఎస్ ప్రొబేషనర్స్‌లో పి. ధాత్రిరెడ్డి, వై.మేఘ స్వరూప్, ప్రఖర్ జైన్, గొబ్బిళ్ళ విద్యాధరి, శివ నారాయణ్ శర్మ, అశుతోష్ శ్రీవాత్సవ, అపూర్వ భరత్, రాహుల్ మీనా, సూరపాటి ప్రశాంత్ కుమార్‌లు ఉన్నారు.
Published date : 07 Oct 2022 07:39PM