Skip to main content

Job Mela In TS: ఆగస్టు 4వ తేదీన సింగరాయకొండలో జాబ్‌మేళా

ఒంగోలు అర్బన్‌/సింగరాయకొండ: ఈ నెల 4వ తేదీన సింగరాయకొండ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో నిర్వహించనున్న జాబ్‌మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాసులు సూచించారు. మంగళవారం జాబ్‌మేళాకు సంబంధించిన పోస్టర్‌ను ప్రకాశం భవనంలో జేసీ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొండపి నియోజకవర్గంతో పాటు జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేలా రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఉపాధి కల్పన శాఖ, సీడాప్‌ సంయుక్తంగా కొండపి వైఎస్సార్‌ సీపీ ఇన్‌చార్జ్‌ వరికూటి అశోక్‌బాబు సహకారంతో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనిలో 15 కంపెనీలు పాల్గొని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. వివరాలకు 80089 86256, 81252 15216ను సంప్రదించాలని సూచించారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి లోకనాథం, బాషా, శ్రీనివాసాచారి పాల్గొన్నారు.

also read: Free Training: నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ.. #sakshieducation

నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి

జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాసులు

Published date : 02 Aug 2023 07:36PM

Photo Stories