Skip to main content

Two Sessions Admissions : డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్‌లో రెండు సెషన్లుగా ప్రవేశాలు.. ఈ ఏడాది నుంచే అమలుకు యూజీసీ లేఖలు!

డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్‌లో ప్రవేశాలను ఏడాదికి రెండు సార్లు చేపట్టాలని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ సంకల్పించింది..
Two sessions admissions for Degree, PG and Engineering colleges

తిరుపతివిద్యార్థులకు ఉన్నత విద్యను చేరువ చేయాలనే ఉద్దేశంతో యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) సరికొత్త నిర్ణయం తీసుకుంది. డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్‌లో ప్రవేశాలను ఏడాదికి రెండు సార్లు చేపట్టాలని సంకల్పించింది. ఈ మేరకు సంసిద్ధత తెలపాలని ఇప్పటికే పలు విశ్వవిద్యాలయాలకు లేఖలు రాసింది. దీంతో వర్సిటీ అధికారులు సాధ్యాసాధ్యాలపై చర్చలు సాగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో ఏడాదికి రెండు సెషన్లలో ప్రవేశాలు చేపడుతున్నారు. వారి విద్యావ్యవస్థ సైతం విజయవంతంగా నడుస్తుండటంతో మనదేశంలో సైతం ఇదే తరహాలో అడ్మిషన్ల ప్రక్రియ నిర్వర్తించాలని యూజీసీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

Group 2 Exam: గ్రూప్‌–2 పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు బీసీ స్టడీసర్కిల్‌ ఆధ్వర్యంలో ఆఫ్‌లైన్‌ గ్రాండ్‌ టెస్టులు... ఎక్క‌డంటే..

విద్యార్థులకు కలసి వచ్చే అంశమే..

రెండు సెషన్ల అడ్మిషన్ల ప్రక్రియ విద్యార్థులకు కలసి వచ్చే అంశంమే. మొదటి సెషన్‌లో సీటు దొరకకుంటే, రెండో సెషన్‌లో ప్రవేశం పొందవచ్చు. దీంతో విద్యా సంవత్సరం నష్టపోకుండా విద్యార్థులు డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్‌లో చేరవచ్చు. ప్రస్తుతం అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. కానీ, చాలా మంది అడ్మిషన్లు పొందలేక పోతున్నారు. కొన్ని విద్యాసంస్థలు పరీక్ష ఫలితాలను సకాలంలో విడుదల చేయలేకపోవడం, ఫెయిలైన విద్యార్థులు మళ్లీ ఇన్‌స్టెంట్‌ పరీక్షలు రాయడంతో సకాలంలో అడ్మిషన్లు పొందలేని పరిస్థితి. వీరందరికీ రెండో సెషన్‌ ప్రవేశాల ప్రక్రియ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. విద్యావేత్తలు, అధికారులు సైతం యూజీసీ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. ఈ ప్రక్రియ అమలైతే జిల్లాలో ఏటా సుమారు 5వేల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ఏడాది నష్టపోకుండా విద్యను అభ్యసించే అవకాశం దక్కనుంది.

Digital lesson: ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ తరగతులు

తర్జన భర్జనలో విద్యాసంస్థలు

ఏటా రెండు సార్లు ప్రవేశాల చేపట్టే విధానంపై వర్సిటీలు తర్జన భర్జన పడుతున్నాయి. ఎస్వీయూ, మహిళా వర్సిటీ, వేదిక్‌, జాతీయ సంస్కృత వర్సిటీలో రెండు సెషన్లలో అడ్మిషన్లు చేపట్టే సదుపాయాలు ఉంది. అయితే బోధన సిబ్బంది కొరత, సీట్ల కేటాయింపు, హాస్టల్‌ వసతి, పరీక్షల విధి విధానాలపై మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. ఏడాదికి రెండు బ్యాచ్‌లకు ఒకే అధ్యాపకుడు బోధించడం ఎలా సాధ్యమనే వాదన వినిపిస్తోంది. మొదటి సెషన్‌ అడ్మిషన్లు పూర్తి చేసి సెప్టెంబర్‌లో తరగతులు ప్రారంభించి జనవరి, ఫిబ్రవరిలో మొదటి సెమిస్టర్‌ పరీక్షలు పూర్తి చేయాల్సి ఉంటుంది. రెండో సెషన్‌ అడ్మిషన్లు జనవరిలో చేపట్టే నాటికి మొదటి సెషన్‌లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు మొదటి సెమిస్టర్‌ పూర్తవుతుంది. మరి రెండో సెషన్‌లో అడ్మిషన్లు పొందిన విద్యార్థుల పరిస్థితి ఏమిటనే వాదన సైతం సర్వత్రా ఉంది.

Mega Job Mela: జాబ్‌ మేళాలో 52 కంపెనీలు... 1500 ఉద్యోగాలు

మార్గదర్శకాలు రావాల్సి ఉంది

రెండు సెషన్లలో అడ్మిషన్లు చేపట్టే ప్రక్రియ విదేశాల్లో అమలు చేస్తున్నారు. దీనిపై యూజీసీ నుంచి మార్గదర్శకాలు రావాల్సి ఉంది. వచ్చిన వెంటనే ఈ విషయంపై నిర్ణయాలు తీసుకుంటాం. బోర్డు దృష్టి తీసుకెళ్లి విధివిధానాలు, సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తాం. విదేశీ విద్యావిధానం అమలుతో పాటు గ్రాస్‌ ఎన్‌రోల్‌ మెంట్‌ పెరుగుతుంది.

– జీఎస్‌ఆర్‌ కృష్ణమూర్తి,వీసీ, జాతీయ సంస్కృత వర్సిటీ

హాజరు శాతం పెరిగే అవకాశం

ఏడాదికి రెండు సార్లు అడ్మిషన్లు ప్రక్రియ అమలు చేస్తే విద్యార్థుల హాజరు శాతం పెరిగే అవకాశముంది. డ్రాపవుట్స్‌ గణనీయంగా తగ్గుతాయి. మహిళలు ఉన్నత విద్యకు మరింత దగ్గరవుతారు. వనరుల సమీకరణ, విధివిధానాలపై పూర్తి స్థాయి అధ్యయం చేయాలి. యూజీసీ, ఉన్నత విద్యామండలి ఆదేశాల మేరకు నిర్ణయాలు తీసుకుంటాం.

– భారతి, వీసీ, పద్మావతి

ESCI New Courses: ఎస్కీలో నాలుగుకొత్త కోర్సులు..ఆగస్టు నుంచే క్లాసులు, ఫీజు వివరాలు ఇవే

మహిళా వర్సిటీ విద్యార్థులకు ప్రయోజనకరం

పలు కారణాల వల్ల జూలైలో అడ్మిషన్‌ పొందలేని విద్యార్థులు జనవరిలో జరిగే రెండో సెషన్‌లో అడ్మిషన్‌ పొందే అవకాశం లభిస్తుంది. ఇది విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరం. పక్కదోవ పట్టకుండా సాఫీగా తమ ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశాలలో ఈ విధానం విజయవంతంగా కొనసాగుతోంది.

–వి శ్రీకాంత్‌రెడ్డి, వీసీ, ఎస్వీ యూనివర్సిటీ

రెండు విడతలుగా..

ప్రస్తుతం ఏడాదిలో ఒకే సారి జూలై– ఆగస్ట్‌లో యూనివర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లోనూ అడ్మిష్లన ప్రక్రియ సాగుతోంది. అయితే విద్యార్థుల సౌకర్యార్థం ఈ విద్యాసంవత్సర నుంచే జనవరి–ఫిబ్రవరి క్యాలెండర్‌ ఇయర్‌ ప్రారంభంలో సైతం డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్‌ కోర్సుల్లో అడ్మిషన్లు చేపట్టాలని యూజీసీ సన్నాహాలు చేస్తోంది. దీంతో జూలైలో అడ్మిషన్లు పొందలేని విద్యార్థులు తిరిగి జనవరి–ఫిబ్రవరిలో చేపట్టే రెండవ సెషన్‌లో ప్రవేశాలు పొందేందుకు వీలుంటుంది.

Hostels Admissions : వ‌స‌తి గ్రుహాల్లో విద్యార్థుల ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు.. అర్హులు వీరే..

Published date : 22 Jun 2024 09:45AM

Photo Stories