Hostels Admissions : వసతి గ్రుహాల్లో విద్యార్థుల ప్రవేశానికి దరఖాస్తులు.. అర్హులు వీరే..
అనంతపురం: బీసీ సంక్షేమ వసతి గృహాల్లో ఖాళీగా ఉన్న సీట్ల కోసం అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు బీసీ సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ కుష్బూకొఠారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని తాడిపత్రి, కళ్యాణదుర్గం, అనంతపురం డివిజన్ల పరిధిలోని 38 ప్రీమెట్రిక్ వసతి గృహాల్లో బాలురకు 3,103, బాలికలకు 1,364 సీట్లు ఖాళీ ఉన్నాయన్నారు.
Degree Admissions : డిగ్రీ కళాశాలల్లో ఈ గ్రూపుల్లో అడ్మిషన్లు ప్రారంభం..
అలాగే, 17 పోస్ట్ మెట్రిక్ వసతి గృహాల్లో బాలురకు 622, బాలికలకు 547 సీట్లు ఉన్నాయని, అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇప్పటికే పాఠశాల, కళాశాలలు పునఃప్రారభమైన తరుణంలో హాస్టల్ వసతి కోసం రెన్యూవల్ చేసుకున్న విద్యార్థులు రెండు రోజుల్లో హాజరుకావాలని సూచించారు. రెన్యూవల్, కొత్త అడ్మిషన్ల కోసం అనంతపురం డివిజన్ విద్యార్థులు 96189 98334, తాడిపత్రి డివిజన్ విద్యార్థులు 94405 57253, కళ్యాణదుర్గం డివిజన్ విద్యార్థులు 9346558001 నంబర్లను సంప్రదించాలన్నారు.
Tags
- BC Welfare Hostels
- admissions
- Eligible students
- Applications
- BC Welfare Deputy Director Kushboo Kothari
- schools and colleges re open
- boys hostel
- new academic year
- Girls Hostels
- Education News
- Sakshi Education News
- vacant seats
- BC Welfare Hostels
- Deputy Director
- Kushboo Kothari
- Anantapuram
- hostel admissons
- sakshieducation latest news