రేగిడి: జిల్లా కేంద్రంలో మార్చి 26న నిర్వహించిన ఆలిండియా ఆర్ట్స్ కాంపిటేషన్ కమ్ ఎగ్జిబిషన్ పోటీల్లో స్థానిక ఉంగరాడమెట్ట డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల విద్యార్థులు తమ సత్తాచాటారు.
ఆర్ట్స్ పోటీల్లో సత్తాచాటిన విద్యార్థులు
ఈ పోటీల్లో పాల్గొన్న ఐదుగురు విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ రాగా, ఏడుగురు విద్యార్థులకు సిల్వర్ మెడల్స్ వచ్చాయని, మరో 37 మందికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్లను నిర్వాహకులు అందించినట్లు ప్రిన్సిపాల్ బి.బుచ్చిరాజు మంగళవారం వెల్లడించారు. కొత్తవలస ఆర్ట్స్ టీచర్ డి.మోహనరావు, స్థానిక కళాశాల క్రాఫ్ట్ టీచర్ జి.భూషణరావు, లైబ్రేరియన్ కె.పార్థసారథిల సహకారంతో ఈ బహుమతులు వచ్చాయన్నారు. మెడల్స్, సర్టిపికెట్లు సాధించిన విద్యార్థులను పాఠశాలలో ప్రిన్సిపాల్‌తో పాటు ఉపాధ్యాయులు ఈ సందర్భంగా అభినందించారు.