విద్యార్థులను విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దాలి
Sakshi Education
డోర్నకల్: ఉపాధ్యాయులు విద్యార్థులను విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దాలని డీఈఓ రామారావు కో రారు. స్థానిక జెడ్పీహెచ్‌ఎస్‌లో జరుగుతున్న ఉపాధ్యాయ శిక్షణ శిబిరాన్ని శుక్రవారం డీఈఓ పరిశీలించిన మాట్లాడారు.
ఎఫ్‌ఎల్‌ఎన్ శిక్షణను సద్వి నియోగం చేసుకుని పాజిటివ్ దృక్పథంతో విద్యాబోధన చేస్తూ సమాజానికి ఉపయోగపడే విదంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని కోరారు. తరగతి గదిలో బోధనలు సమాజంపై ప్రభావితం చేస్తాయన్నారు. ఎంఈఓ పూల్‌చంద్, ఏఎంఓ శ్రీరాములు, కోర్సు డైరెక్టర్ లక్ష్మా, జిల్లా పరిశీలకులు సుధాకర్, సారంగం, హెచ్‌ఎం మరియామాణిక్యం ఉన్నారు..
కృత్యాదార విద్యాబోధన చేయాలి
కురవి: ఉపాధ్యాయులు విద్యార్థులకు కృత్యాదార విద్యాభోదన చేయాలని డీఈఓ రామారావు సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని హైస్కూల్‌లో నిర్వహించిన తొలిమెట్టు శిక్షణ కార్యక్రమాన్ని డీఈఓ సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి పాఠశాల నుంచి తెలుగు, గణితం, ఇంగ్లిష్ శిక్షణకు హాజరుకావాలని ఆదేశించారు. ప్రతీ ఉపాధ్యాయుడు సమయపాలన పాటించి, నిబద్ధతతో బోధన జరపాలన్నారు. గణితంలో పాల్గొన్న టీచర్‌లకు మాడ్యూల్స్ అందజేశారు.
Published date : 05 Aug 2023 05:25PM