Padmavati Women's University: స్మార్ట్ స్కిల్స్‌పై శిక్షణా శిబిరం
తిరుపతి సిటీ : పద్మావతి మహిళా వర్సిటీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ సెంటర్, ఏషియా పసిఫిక్ ట్రైనింగ్ సెంటర్ ఫర్ ఐసీటీ, బంగ్లాదేశ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ సంయుక్తంగా గరువారం వర్సిటీలోని సావేరి సెమినార్ హాల్‌లో స్మార్ట్ స్కిల్స్ వర్కషాపును నిర్వహించారు. వీసీ భారతి మాట్లాడుతూ మహిళా వర్సిటీలో మహిళా పారిశ్రామికవేత్తల కోసం ఆరు ఇంక్యుబేషన్ సెంటర్లు ఉన్నాయన్నారు. పరస్పర సహకారంతో అనేకమంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తున్నామని తెలిపారు. మహిళలను ప్రోత్సహించేందుకు లేటెస్ట్ టెక్నాలజీస్, డిజిటల్ మార్కెటింగ్, బ్రాండింగ్, స్టోరీ టెల్లింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్ ద్వారా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే విధానాలపై శిక్షణలో అవగాహన కల్పిస్తారని తెలిపారు. రిజిస్ట్రార్ రజిని, మాజీ వీసీ దుర్గాభవాని, ఏషియా పసిఫిక్ ట్రైనింగ్ సెంటర్ ఫర్ ఐసీటీ డెవలప్‌మెంట్ డైరెక్టర్ కియాంగ్ కో, బంగ్లాదేశ్ సంస్థకు చెందిన సాహిద్ ఉద్దీన్ అక్బర్, నేషనల్ కన్సల్టెంట్ ఆన్ ఐసీటీ ఫర్ డెవలప్‌మెంట్ ప్రొఫెసర్ ఉష వ్యాసులు రెడ్డి పాల్గొన్నారు.
చదవండి: JEE Mains Free Training: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం