Govt and Private ITI : ప్రభుత్వ, ప్రవేటు ఐటీఐ కళాశాలల్లో ప్రవేశానికి 4వ విడత అడ్మిషన్లు
లేపాక్షి: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలల్లో మిగులు సీట్ల భర్తీకి 4వ విడత అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టామని జిల్లా కన్వీనర్, లేపాక్షి ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ రాయపురెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 26వ తేదీలోపు www.iti.ap.gov.in వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.
Jobs Mela : ఈనెల 25న డిగ్రీ కళాశాల ఆవరణలో జాబ్ మేళా
అభ్యర్థి దరఖాస్తు చేసుకున్న కళాశాలకు వెళ్లి ఒరిజనల్ సర్టిఫికెట్లను 27వ తేదీ సాయంత్రం 3 గంటల్లోపు వెరిఫై చేయించుకోవాలన్నారు. ఆన్‌లైన్‌లో వెరిఫై చేయించుకున్న వారు మాత్రమే కౌన్సెలింగ్‌కు అర్హులన్నారు. ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లో 28వ తేదీన, ప్రైవేటు ఐటీఐ కళాశాలలో ఈ నెల 30వ తేదీన కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. వివరాలకు 9440285629, 9490445744, 8523831381 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- Admissions 2024
- fourth session admissions
- ITI colleges
- students education
- ITI principal Rayapu Reddy
- Govt and Private ITI College Admissions
- online applications
- eligible students for iti admissions
- govt iti college admissions on 28th
- private iti college admissions 30
- Education News
- Sakshi Education News