MBBS Admissions: మెడికల్ ‘సీ’ కేటగిరీ సీట్లకు నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్ ‘సీ’ కేటగిరీ సీట్ల భర్తీకి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. నీట్ యూజీ–2021లో నిర్ణీత కటాఫ్ సాధించి, గతంలో దరఖాస్తు చేయనివారు.. ఇప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చని వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ శంకర్ మంగళవారం ఓ ప్రకటనలో సూచించారు. ఇప్పటివరకు కాంపిటెంట్ అథారిటీ, మేనేజ్‌మెంట్ కోటాలో దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు బుధవారం మధ్యాహ్నం 2లోగా తమ దరఖాస్తులను అందించాలని స్పష్టం చేశారు. ఈ విభాగంలో ప్రైవేట్ అన్ ఎయిడెడ్ నాన్ మైనార్టీ, మైనార్టీ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో అందుబాటులో ఉన్న మేనేజ్‌మెంట్ కోటా సీట్లను భర్తీ చేయనున్నారు.
Also read: Sports Coaching: స్పోర్ట్స్ కోచింగ్ డిప్లొమాకు దరఖాస్తుల ఆహ్వానం
బీడీఎస్ సీట్లకు మాప్ అప్ రౌండ్ కౌన్సెలింగ్
బీడీఎస్ విభాగంలో మిగిలిన సీట్లకు మాప్ అప్ రౌండ్ కౌన్సెలింగ్ నిర్వహించేందుకు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. కన్వీనర్ కోటా కింద మొదటి 4 దశల్లో నిర్వహించిన కౌన్సెలింగ్ తర్వాత 113 బీడీఎస్ సీట్లు మిగిలాయి. వీటి భర్తీకి త్వరలో మాప్ అప్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఇప్పటికే సీట్లు పొందిన వారు, సీట్లు పొందినప్పటికీ చేరనివారు ఈ కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అనర్హులని వర్సిటీ ప్రకటించింది. ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో ఉన్నవారు, కాంపిటెంట్ అథారిటీ కోటాలో సీట్లు పొందనివారు మాత్రమే ఇందులో పాల్గొనేందుకు అర్హులని స్పష్టం చేసింది. వివరాలకు https:// ug.ntruhsadmissions.com/ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది.
Also read: AP LAWCET 2022 నోటిఫికేషన్ విడుదల... ముఖ్యమైన తేదీలు ఇవే