Skip to main content

Biomedical Course: కొత్తగా బయో మెడికల్‌ కోర్సు

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో కొత్తగా బీఎస్సీ బయో మెడికల్‌ కోర్సు ఈ విద్యా సంవత్సరం (2024–25) నుంచే అందుబాటులోకి రానుంది.
New Biomedical Course

రాష్ట్ర ఉన్నత విద్యామండలి దీనికి సంబంధించిన కసరత్తు చేస్తోంది. తొలిసారిగా ప్రవేశపెట్టబోయే ఈ కోర్సు బోధన ప్రణాళిక, క్లాసుల నిర్వహణ, కార్పొరేట్‌ ఆస్పత్రుల భాగస్వామ్యంపై ఉన్నతాధికారులు ఇప్పటికే పలు దఫాలుగా చర్చించారు. ముందుగా ప్రయోగాత్మకంగా స్వయంప్రతిపత్తి గల యూనివర్సిటీల పరిధిలో (అటానమస్‌) దీనిని అందుబాటులోకి తేనున్నారు.

150 సీట్లు మాత్రమే తొలిఏడాది భర్తీ చేయాలని నిర్ణయించారు. ఈ దశలో ఎదురయ్యే సవాళ్లు గుర్తించి, అవసరమైతే మార్పులుచేర్పులతో వచ్చే ఏడాది రాష్ట్రవ్యాప్తంగా ఈ కోర్సును అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు. శరవేగంగా విస్తరిస్తున్న కార్పొరేట్‌ వైద్యరంగంలో బయో మెడికల్‌ సేవలకు మంచి డిమాండ్‌ ఉందని గుర్తించారు.

చదవండి: Best Branch In BTech : బీటెక్‌లో ఏ బ్రాంచ్ సెల‌క్ట్‌ చేసుకుంటే మంచిదంటే..?

వివిధరకాల లేబొరేటరీలు, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో సాంకేతిక వైద్య సేవల్లో మంచి ఉపాధి అవకాశాలున్నాయి. డిమాండ్‌ తగ్గట్టుగా నిపుణుల కొరత ఉంది. దీనిని భర్తీ చేయడానికి డిగ్రీ స్థాయిలోనే బయో మెడికల్‌ సబ్జెక్టును తీసుకురానున్నారు.

సిరాలజీ, బయాలజీ, ఫోరెన్సిక్‌ సైన్స్, డీఎన్‌ఏ, ఫిజియోథెరపీ సహా వైద్య సంబంధమైన అనేక సబ్జెక్టులతో ప్రణాళిక రూపొందించే యోచనలో ఉన్నారు. ఈ కోర్సును ఇంజనీరింగ్‌ పూర్తిచేసిన విద్యార్థులు కూడా అనుబంధ కోర్సుగా చేసే అవకాశం కల్పించాలని ఆలోచనలో ఉన్నట్టు మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి తెలిపారు.

దీంతోపాటు బీకాం ఫైనాన్స్, బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌ వంటి కోర్సులను ఈ ఏడాది పరిచయం చేసేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు.    
 

Published date : 11 Apr 2024 12:07PM

Photo Stories