Skip to main content

Collector Jitesh V Patil: వైద్య కళాశాల పనుల్లో వేగం పెంచండి

కామారెడ్డి క్రైం: వైద్య కళాశాల పనులను సెప్టెంబ‌ర్ 15 నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర వైద్య సేవ మౌలిక సదుపాయాల అభివృధి సంస్థ ఇంజినీరింగ్‌ అధికారులను కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ఆదేశించారు.
Collector Jitesh V Patil
వైద్య కళాశాల పనుల్లో వేగం పెంచండి

కామారెడ్డి వైద్యకళాశాల పనులను సెప్టెంబ‌ర్ 5న‌ ఆయన పరిశీలించారు. పరిపాలన విభాగం, అనాటమీ, లెక్చర్‌ గ్యాలరీలలో మిగిలిన ఫ్లోరింగ్‌, కా ర్పెంటరీ పనులను, సీసీ రోడ్డు నిర్మాణం, ఇతర చిన్నచిన్న పనులను వేగవంతం చేయాలన్నారు. ఫర్నిచర్‌, సౌండ్‌ సిస్టం, ప్రొజెక్టర్‌, ఇంటర్నెట్‌లాంటి అన్ని సదుపాయాలు కల్పించాలన్నారు. ఈ విద్యా సంవత్సరంలో మొదటి సంవత్సరం తరగతులు సెప్టెంబ‌ర్లోనే ప్రారంభించడం కోసం అడ్మిషన్లు ప్రారంభం అయ్యాయన్నారు. ఇక్కడ చదివే వంద మంది వైద్య విద్యార్థులకు అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించాలన్నారు. ఫైర్‌ సేఫ్టీ, భద్రత చర్యలు తీసు కోవాలని సూచించారు.

చదవండి: State Best Teacher Award: స్టేట్‌ బెస్ట్‌ టీచర్‌గా డాక్టర్‌ సుందరాచారి

ఆహ్లాదకార వాతావరణానికి చక్కటి పచ్చిక బయళ్లు ఏర్పాటుచేయాలన్నా రు. అంతకుముందు జిల్లా కేంద్ర ఆస్పత్రిని 250 పడకల స్థాయికి పెంచుతూ భవనంపై భాగంలో నిర్మించిన నూతన భవనంలో మౌలిక సదుపాయాలను పరిశీలించారు. రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. ప్రైవేట్‌ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులలో మెరుగైన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు. సౌకర్యాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ వెంకటేశ్వర్‌, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ విజయలక్ష్మి, ఈఈ చంద్రశేఖర్‌, డిప్యూటీ ఈఈ సుధాకర్‌, ఏఈ అరవింద్‌ తదితరులు పాల్గొన్నారు.

చదవండి: Govt Medical College: మెడికల్‌ కాలేజీ రెడీ!

Published date : 06 Sep 2023 04:29PM

Photo Stories