Skip to main content

Government Medical College: వైద్య కళాశాల సమస్యలపై విచారణ కమిటీ ఏర్పాటు

కొత్తగూడెం రూరల్‌: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని వైద్య కళాశాలలో విద్యార్థు లపై ప్రిన్సిపాల్‌ వేధింపులు, ఇతర సమస్యలపై విచారణ కమిటీ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ ప్రియాంక ఆల తెలిపారు.
Students discussing issues at medical college   Collector Priyanka Ala addressing reporters about inquiry committee formation   inquiry committee on Bhadradri Kothagudem District medical college issues

జెడ్పీ సీఈఓ ఎస్‌.ప్రసూన రాణి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కమిటీలో చీఫ్‌ ప్లానింగ్‌ అధికారి యు.శ్రీనివాసరావు, జిల్లా ఉద్యానవన అధికారి సూర్యనారాయణ సభ్యులుగా ఉంటారని పేర్కొన్నారు. మార్చి 22వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు విచారణ పూర్తి చేయాలని కమిటీని కలెక్టర్‌ ఆదేశించారు.

చదవండి: 96 Faculty Jobs: ‘గాంధీ’లో 96 అధ్యాపక వైద్య పోస్టులు భర్తీ

హాస్టల్‌లో కనీస సౌకర్యాలు, భోజనంలో నాణ్యత, మెస్‌ చార్జీల వసూలు, ప్రిన్సిపాల్‌ వేధింపులు, హాస్టల్‌లో రాత్రి వేళ వీడియోలు తీయించడం వంటి అంశాలపై విచారణ చేపట్టి, నివేదిక అందజేయాలని సూచించారు. కాగా, రెండో రోజైన మార్చి 19న‌ కూడా విద్యార్థులు వైద్య కళాశాల ఎదుట ధర్నా చేశారు. దీంతో డీఎంఈ వాణి ఆదేశాల మేరకు ఖమ్మం మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ ఆధ్వర్యంలో కాలేజీలో విచారణ చేపట్టారు.  

చదవండి: Jobs: మెడికల్‌ కళాశాలలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

Published date : 20 Mar 2024 01:08PM

Photo Stories