Skip to main content

Telangana: విద్యార్థుల చెంతకే ప్రభుత్వ వైద్య విద్య

భూపాలపల్లి అర్బన్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహకారంతో జిల్లాలో వైద్య కళాశాలను మంజూరు చేసుకొని నేడు ప్రారంభించుకుంటున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు.
Government medical education is for students
విద్యార్థుల చెంతకే ప్రభుత్వ వైద్య విద్య

 పార్టీ ఆదేశాల మేరకు జిల్లాకేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సెప్టెంబ‌ర్ 14న‌ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మారుమూల గ్రామం అయిన భూపాలపల్లి దినదినాభివృద్ది చెందుతూ జిల్లాగా ఏర్పడి నేడు భూపాలపల్లి జిల్లా వైద్య సేవలకు నిలయంగా నిలుస్తుందన్నారు.

చదవండి: Andhra Pradesh: ఏపీ వైద్య విద్యలో వందేళ్ల రికార్డు

జిల్లాలో 100 పడకల ఏరియా హాస్పిటల్‌తో పాటు, వైద్య కళాశాల, ఆయుష్‌ హాస్పిటల్‌ వచ్చి భూపాలపల్లి మెడికల్‌ హబ్‌గా అభివృద్ధి చెందిందన్నారు. నేడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ వర్చువల్‌గా రాష్ట్రంలోని 9 వైద్య కళాశాలలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. నూతన మండలంగా ఏర్పడిన గోరికొత్తపల్లిలో 16న తహసీల్దార్‌ కార్యాలయాన్ని మంత్రి సత్యవతిరాథోడ్‌ ప్రారంభించనున్నట్లు చెప్పారు. హన్‌మాన్‌ దేవాలయం నుంచి అంబేడ్కర్‌ సెంటర్‌ వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు.

చదవండి: Andhra Pradesh: వైద్య శాఖ కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు తీపికబురు

Published date : 15 Sep 2023 03:44PM

Photo Stories