Skip to main content

Job Mela: 16 న ఉద్యోగ మేళా

కామారెడ్డి క్రైం: నిరుద్యోగ యువతకు ప్రైవేట్‌ రంగంలో ఉద్యోగావకాశాలు కల్పించడం కోసం ఫిబ్ర‌వ‌రి 16 న ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు.
Job fair on 16   Career opportunities for youth  Employment fair for Kamareddy residents

ఈ విషయాన్ని జిల్లా ఉపాధి కల్పన అధికారి మధుసూదన్‌రావు ఫిబ్ర‌వ‌రి 13న‌ ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌, కామారెడ్డిలలోని అపోలో ఫార్మసీలలో ఉద్యోగావకాశాలు కల్పించడం కోసం ఈ మేళా ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.

చదవండి: NHAI Recruitment 2024: ఎన్‌హెచ్‌ఏఐలో 60 డిప్యూటీ మేనేజర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

ఫార్మసీ కోర్సు పూర్తి చేసిన 18 నుంచి 35 ఏళ్లలోపువారు అర్హులని తెలిపారు. ఆసక్తి గలవారు ఈనెల 16న ఉదయం 10 గంటలకు కలెక్టరేట్‌లోని 121 వ గదిలో ఉన్న జిల్లా ఉపాధి కార్యాలయంలో నిర్వహించే ఇంటర్వ్యూలలో పాల్గొనాలని సూచించారు. ఇతర వివరాలకోసం 72079 17714, 79953 89260, 98482 37987, 99899 67088 ఫోన్‌ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

Published date : 14 Feb 2024 02:36PM

Photo Stories