ISRO YUVIKA: భావి శాస్త్రవేత్తలకు వారధి ‘యువికా’
‘క్యాచ్ దెమ్ యంగ్’ పేరిట రెండు వారాల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో విద్యార్థులకు అంతరిక్ష సాంకేతిక విజ్ఞానం, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ తదితర అంశాలపై అవగాహన కల్పించి తద్వారా వారిని పరిశోధనల వైపు దృష్టి మళ్లించడమే ఈ కార్యక్రమ లక్ష్యం. ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిన ఇస్రో మేటి ప్రయోగాలు చేస్తూ, దేశంలోని బాల మేధావులను ప్రోత్సహించే క్రమంలో యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రాం(యువికా) కార్యక్రమం నిర్వహిస్తోంది. దీనికి సంబంధించిన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్(దరఖాస్తు) ప్రక్రియ ఫిబ్రవరి 20న ప్రారంభం కాగా, ఈనెల 20వ తేదీన ముగుస్తుంది.
చదవండి: ISRO: ఇస్రోకు రెండో ప్రయోగ కేంద్రం
మే 13న యువ విజ్ఞాన కార్యక్రమం
మార్చి 20 వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత 28న తొలి జాబితా, ఏప్రిల్ 4న రెండో జాబితాను ప్రకటిస్తారు. ఎంపికై న విద్యార్థులు మే 12న ఇస్రో కేంద్రాల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. 13న యువవిజ్ఞాన కార్యక్రమం నిర్వహిస్తారు.
యువికా ఉద్దేశం
ఇస్రో చేపట్టిన యువ విజ్ఞాన కార్యక్రమానికి ఎంపికై న విద్యార్థులతోపాటు కుటుంబ సభ్యుల్లో ఒకరిని వెంట అనుమతిస్తారు. ఇస్రోకు చెందిన అహ్మదాబాద్, డెహ్రాడూన్, శ్రీహరికోట, హైదరాబాద్, బెంగళూర్, షిల్లాంగ్, తిరువనంతపురంలో విద్యార్థులకు ప్రముఖ శాస్త్రవేత్తలతో ముఖాముఖి చర్చా వేదికలు, ప్రయోగశాలల సందర్శన, ముఖ్యులతో సమావేశాల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తారు. అంతరిక్ష శాస్త్రం, రాకెట్ ప్రయోగాలకు సంబంధించిన అంశాలపై ప్రాథమిక అవగాహన కల్పిసారు.
చదవండి: ISRO YUVIKA: ఇస్రో 'యువికా'కు దరఖాస్తుల ఆహ్వానం
విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి
యువ శాస్త్రవేత్తలుగా ఎదగాలనే ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అంతరిక్ష పరిశోధనలపై విద్యార్థులకు అవగాహన కలుగుతుంది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు సైన్స్ ఉపాధ్యాయులు శ్రద్ధ తీసుకొని తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఈ విషయాలను తెలియజేయాలి. విద్యార్థుల్లో ఉన్న శాసీ్త్రయ జిజ్ఞాసను మేల్కొల్పడం అంతరిక్షం పట్ల అంతరిక్ష రహస్యాల పట్ల ఆసక్తిని పెంపొందించడం శాసీ్త్రయ సత్యాలను అన్వేషించడం కోసం విద్యార్థులకు ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.
– గంగాకిషన్, జిల్లా సైన్స్ అధికారి, నిజామాబాద్
- ‘క్యాచ్ దెమ్ యంగ్’ పేరిట యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రాం
- బాల శాస్త్రవేత్తల గుర్తింపునకు ప్రత్యేక కార్యక్రమం
- ఐదేళ్ల నుంచి ఇస్రో ఆధ్వర్యంలో కొనసాగింపు
- తొమ్మిదో తరగతి విద్యార్థులు అర్హులు
- దరఖాస్తుల స్వీకరణకు మార్చి 20 వరకు గడువు
ఎవరు అర్హులు.. దరఖాస్తు ఎలా..?
2023–24 విద్యా సంవత్సరంలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. 8వ తరగతి వార్షిక పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా 50 శాతం, ఆన్‌లైన్ క్విజ్ ప్రతిభకు, సైన్స్ ఫెయిర్‌లో పాల్గొన్న వారికి 10 శాతం, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ చేసిన వారికి 5 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్న వారికి 15 శాతం మార్కులు కేటాయించి అనుమతిస్తారు. ఇస్రో అధికారిక వెబ్‌సైట్ www. isro. gov. in లో లాగిన్ అయి, యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అందులో విద్యార్థుల వివరాలను నమోదు చేయాలి.