YSR Sampoorna Poshana: అంగన్‌వాడీలు.. పౌష్టికాహార కేంద్రాలు
క్రమం తప్పకుండా పౌష్టికాహార పంపిణీ, ఆరోగ్య పరీక్షల వల్ల అంగన్వాడీ లబ్ధిదారుల్లో గణనీయమైన వృద్ధి కనిపిస్తోంది. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారుల సంఖ్య పెరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో అంగన్వాడీలకు వచ్చే ఆహారం దుర్వినియోగమయ్యేది. చిన్నారులకు కోడిగుడ్లు సక్రమంగా అందేవి కావు. అయితే అప్పటి టీడీపీ హయాంలో ఉన్న ఈ విధానాలకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చెక్ పెట్టింది. ప్రతి చిన్నారి ఆరోగ్యంగా ఉండాలని, సంపూర్ణ పౌష్టికాహారం అందించాలని, ఎక్కడైనా అవకతవకలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్వయాన హెచ్చరించారు. దీంతో అంగన్వాడీ కేంద్రాల పనితీరులో పూర్తి స్థాయిలో మార్పులు కనిపించాయి.
Also read: Teaching Method viral video ‘ఏం ఐడియారా బాబూ’ అంటున్న జనం!
కనిపిస్తున్న అభివృద్ధి
వైఎస్సార్ జిల్లాలో 1,57,015 మంది చిన్నారులు ఉన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చి పౌష్టికాహారం తీసుకుంటున్నారు. పౌష్టికాహారం సక్రమంగా అందించడం ఒక ఎత్తయితే, వారి ఎదుగుదలను అంచనా వేయడం మరొక ఎత్తు. ప్రధానంగా చిన్నారుల్లో రక్తహీనత, బరువు తక్కువగా ఉండేవారికి మంచి ఆహారం అందించడం, అలాగే ఎత్తుకు తగ్గ బరువు, వయస్సుకు తగ్గ ఎత్తు ఉండే వారికోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన నాుగేళ్లలో అంగన్వాడీ కేంద్రాల్లో అభివృద్ది కనిపిస్తోంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటికీ, ఇప్పటికీ కేంద్రాల్లో మార్పు కనిపిస్తోంది.
Also read: Hidden Talent: బుడతా..! నీ టాలెంట్‌కు హ్యాట్సాఫ్.. నెటిజన్లు ఫిదా..!
పటిష్టంగా పర్యవేక్షణ
జిల్లాలో 11 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉండగా 2389 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో చిన్నారులే కాకుండా గర్భిణులు 14,888, బాలింతలు 14,239 మంది ఉన్నారు. అలాగే అంగన్వాడీ కేంద్రాలపై నిత్యం పర్యవేక్షణ చేయడమే కాకుండా నెలకు ఒకసారి ప్రగతిపై సమీక్ష నిర్వహిస్తున్నారు. చిన్నారులకు బాలామృతం, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం, చిక్కీలు, రాగిపిండి, ఎండుఖర్జూరం, జొన్నపిండి, అటుకులు వంటి బలవర్థక పదార్థాలు ఇవ్వడం ద్వారా రక్తహీనతను అధిగమిస్తున్నారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం సక్రమంగా అందుతుందా? లేదా? అన్న దానిపై నిఘా పెంచడం వల్ల ప్రతి ఒక్కరికీ ఆహార ఫలాలు అందుతున్నాయి.
Also read: KGBV: నాణ్యమైన విద్యకు కేరాఫ్ అడ్రస్‌గా కేజీబీవీ.. బోధనలో ఠీవి
బరువు, ఎత్తు తక్కువగల చిన్నారులు
జిల్లాలోని 11 ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో బరువు తక్కువగల చిన్నారులు 3320 మంది ఉన్నారు. అలాగే ఎత్తు తక్కువగా ఉన్న చిన్నారులు 5563 మంది నమోదయ్యారు. వీరి శారీరక, మానసిక ఎదుగుదలకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు.
- చిన్నారుల సూచీల్లో గణనీయమైన వృద్ధి
- వైఎస్సార్ సంపూర్ణ పోషణతో గర్భిణులు, బాలింతలకు ఆసరా
- పౌష్టికాహార సరఫరాపై ప్రత్యేక నిఘా
Also read: 77th Independence Day: ప్రతిభకు పదును