ఎంబీబీఎస్ సీట్లకు వెబ్ కౌన్సెలింగ్
Sakshi Education
వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ సీట్లకు మార్చి 30న వెబ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు కాళోజీ నారాయణరావు హెల్త్ వర్సిటీ పేర్కొంది.
ఈ మేరకు మార్చి 29న నోటిఫికేషన్ ను విడుదల చేసింది. సీట్ల ఖాళీల వివరాలను వెబ్‌సైట్లో పొందుపరిచామని, ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాలని సూచించింది.
పీజీ మెడికల్ కన్వీనర్ కోటా భర్తీకి నోటిఫికేషన్
పీజీ మెడికల్ కనీ్వనర్ కోటా సీట్ల భర్తీకి హెల్త్ వర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. వర్సిటీ పరిధిలోని కళాశాలలు, నిమ్స్ కాలేజీలో ఖాళీగా ఉన్న కనీ్వనర్ కోటా సీట్లను భర్తీ చేయనున్నారు. తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చునని, మార్చి 30న మధ్యాహ్నం 2గంటల వరకు ప్రాధాన్యత క్రమంలో కళాశాలల వారీగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించింది. మరింత సమాచారం కోసం ఠీఠీఠీ.జుnటuజిట.్ట్ఛl్చnజ్చn్చ.జౌఠిను సంప్రదించాలని యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి.
Published date : 30 Mar 2022 12:33PM