What is my Goal: అసెంబ్లీలో వినిపించనున్న విద్యార్థుల స్వరం
చట్టసభల పనితీరుపై పాఠశాల విద్యార్థులకు అవగాహన పెంచేందుకు వీలుగా ‘వాట్ ఈజ్ మై గోల్’అనే హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ శ్రీకారం చుట్టింది. స్టార్టప్ ప్రణాళికలో భాగంగా చేపట్టిన ‘అండర్ 18 ఎన్నికలు’ తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ఏప్రిల్ 11న ప్రారంభించారు. కొద్ది వారాల్లో మాక్ అండర్ 18 ఎన్నికలు నిర్వహించి వారితో మాక్ అసెంబ్లీ నిర్వహించేందుకు ‘వాట్ ఈజ్ మై గోల్’స్టార్టప్ సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 50 పాఠశాలలకు చెందిన 200 మంది విద్యార్థులు వివిధ పదవులకు ఎన్నికై మాక్ అసెంబ్లీలో తమ గొంతును వినిపిస్తారు.
చదవండి: Skill Training: నైపుణ్య శిక్షణ.. ఉపాధి రక్షణ
విద్యార్థులకు రాజకీయాలతోపాటు వివిధ కెరీర్ అవకాశాలపై అవగాహన కల్పించేందుకు ‘వాట్ ఈజ్ మై గోల్’తోడ్పడుతోందని టీఎస్‌ఐసీ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ శాంత తౌటం వెల్లడించారు. చట్టసభల పనితీరును విద్యార్థులు నేరుగా తెలుసుకునేందుకు మాక్ అసెంబ్లీ దోహదం చేస్తుందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టాలు రూపొందే ప్రక్రియపై విద్యార్థులకు అవగాహన కలిగేందుకు ఇది ఉపయోగపడుతుందని టి–హబ్ సీఈఓ శ్రీనివాసరావు మహంకాళి అన్నారు. భవిష్యత్ ప్రపంచాన్ని మార్చే నాయకత్వం ఇలాంటి కార్యక్రమాలతోనే రూపుదిద్దుకుంటుందన్నారు.
చదవండి: విద్యార్థుల్లో ఉపాధి నైపుణ్యాలను పెంపొందించడానికి కార్యశాల నిర్వహించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల