అమెరికాలో విద్యావకాశాలపై వర్చువల్ సదస్సులు
ఇలాంటి అనేక సందేహాలకు సమాధానమిచ్చేందుకు ‘ఎడ్యుకేషన్‌యూఎస్‌ఏ’ త్వరలో వర్చువల్ సదస్సులు నిర్వహించనుంది. మాస్టర్స్, పీహెచ్‌డీ కార్యక్రమాలకు సంబంధించిన సదస్సు సెప్టెంబర్ 3న, గ్రాడ్యుయేట్ కార్యక్రమాలకు సంబంధించినది సెప్టెంబర్ 10న జరగనున్నట్లు హైదరాబాద్‌లోని అమెరికా దౌత్యకార్యాలయం తెలిపింది. అమెరికా వ్యాప్తంగా ఉన్న వంద యూనివర్సిటీలు పాల్గొనే ఈ సదస్సుకు హాజరయ్యేందుకు విద్యార్థులు ఎలాంటి రుసుమూ చెల్లించాల్సిన అవసరం లేదని, రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుందని తెలిపింది. మాస్టర్స్, పీహెచ్‌డీ కార్యక్రమాలకు సంబంధించిన సదస్సులో పాల్గొనదలచిన వారు... https://bit.ly/EdUSAFair22EmbWeb లింక్ ద్వారా తమ పేర్లు రిజిస్టర్ చేసుకోవచ్చు. అమెరికాలో అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరేందుకు ప్రయత్నిస్తున్న హైస్కూలు విద్యార్థులు సెప్టెంబర్ 10న జరిగే సదస్సుకు గాను తమ పేర్లను https://bit.ly/EdUSAFair22EmbWeb లింకు ద్వారా నమోదు చేసుకోవాలి. విశ్వవిద్యాలయాల ప్రతినిధులు ఈ సదస్సుల్లో పాల్గొని అండర్‌గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్, డాక్టోరల్ స్థాయి కోర్సుల గురించి వివరిస్తారని అమెరికన్ దౌత్య కార్యాలయం వివరించింది. విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు ఇంట్లోంచే తమ సందేహాలన్నింటినీ తీర్చుకునేందుకు ఇది మంచి అవకాశమని చెప్పారు. వీసా దరఖాస్తుల ప్రక్రియ, అమెరికాలో చదువుకోవడం, జీవించడం వంటి అనేక అంశాల గురించి ఈ సదస్సుల ద్వారా క్షుణ్ణంగా తెలుసుకోవచ్చన్నారు. ఎడ్యుకేషన్‌యూఎస్‌ఏ నిర్వహించే ఈ యూనివర్సిటీ ఫెయిర్ విశ్వసనీయౖమెనదని, దరఖాస్తు ప్రక్రియలోనూ సహాయ, సహకారాలు తాము అందిస్తామని ‘ఎడ్యుకేషన్‌యూఎస్‌ఏ’ అధికార ప్రతినిధి పాట్రీషియా లాసినా తెలిపారు.
చదవండి: